ఆ ముగ్గురిలో భయంకరమైన రియలేజేషన్!
సినిమా అంటే ఏదో ఊహాలోకం. అక్కడ కొచ్చి ఏదో సాధించాలనే తపన. పది మందిలో తానో స్పెషల్ అనిపించు కోవాలనే ఆరాంట.
By: Srikanth Kontham | 6 Oct 2025 5:49 PM ISTసినిమా అంటే ఏదో ఊహాలోకం. అక్కడ కొచ్చి ఏదో సాధించాలనే తపన. పది మందిలో తానో స్పెషల్ అనిపించు కోవాలనే ఆరాంట. అందుకోసం ఏళ్ల తరబడి శ్రమ. ఈ క్రమంలో ఏదో ఒక తెలియని శక్తి ముందుకు నడిపిస్తుంది. ఎన్నో కష్టనష్టాలు ఓర్చి చివరికి సక్సెస్ అవుతారు. అటుపై పేరు..డబ్బు..పరపతి అన్ని వస్తాయి. ఆ తర్వాత కొంత కాలానికి కొందరిలో వచ్చే రియలైజేషన్ చూస్తే? జీవితం అంటే ఇంతేనా? అనిపించక మానదు. అలాంటి వాళ్లలో ప్రముఖుడు ఎవరు? అంటే ముందుగా పూరి జగన్నాధ్ పేరు చెప్పాలి. పూరి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వెళ్లి పెద్ద డైరెక్టర్ అయ్యాడు.
ఇష్టమైన పనిలోనే సంతోషం:
గొప్ప గొప్ప నటుల్ని డైరెక్ట్ చేసాడు. కోట్లు సంపాదించాడు. లగ్జరీ లైఫ్ ని ఆస్వాదించాడు. ఇప్పుడు పూరి చెప్పే మాట ఏంటో ? తెలుసా? సంతోషంగా ఉండటం అంటే కోట్లు సంపాదించడం కాదు. పేరు సంపాదించడం అంతకన్నా కాదు. సమాజంలో గౌరవ మర్యాదలు అసలే కాదు. ఇష్టపడిన పనని సంతోషంగా చేయడంలో అసలైన సంతోషం ఉంటుదన్నాడు ఓ రోజు. అది వదిలేసి తెలియని దాని కోసం పరుగులు పెట్టి జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నారని తన అనుభవ పూర్వకంగా చెప్పే ప్రయత్నం చేసారు.
వాళ్లిద్దరిలాగే యంగ్ హీరో:
సరిగ్గా ఇలాంటి హితబోధనే చేసారు గురూజీ త్రివిక్రమ్. మనిషి బ్రతికినంత కాలం నిజాయితీగా, నిబద్దతతో , ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా జీవించడంలోనే అసలైన సంతోషం ఉంటుందన్నారు. దాన్ని వదిలేసి ఎక్కడికో ఏదో సాధించాలని పరుగలు తీడయం అన్నది అనవసరమైన చర్యగానే పేర్కొన్నారు. జీవితంలో ఏదైనా సహజంగా జరగాలి తప్ప పని గట్టుకుని అలాగే ఉండాలని వాస్తవానికి దూరంగా ఉండటం అన్నది జీవితమే కాదన్నారు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వాళ్లిద్దరి నోట్లో నుంచి ఊడి పడినట్లే మాట్లా డాడు.
నీతి..నిజాయితీలోనే అసలైన సంతోషం:
సినిమా అనే ఫ్యాషన్ తో తన ప్రయాణం ఎలా మొదలైంది? ఎక్కడ నుంచి ఎక్కడికి ఎలా వచ్చాడు? అన్నది ఎంతో చక్కగా వివరిస్తూ గొప్ప రియలైజేషన్ చూపించాడు. కూలి పనులు చేసాను. నచ్చని పని అయిన సాప్ట్ వేర్ ఉద్యోగం చేసాను. సినిమాలు చేసే క్రమంలో కష్టాలు పడ్డాను. సక్సెస్ అయిన తర్వాత ఎంతో మంది డబ్బున్న వాళ్లను చూసాను. హీరోయిన్లతో నటించాను. గొప్ప గొప్ప వ్యక్తులను కలిసాను. ఇవన్నీ చూసిన తర్వాత ఎలాంటి అబద్దాలు చెప్పకుండా..నీతిగా..నిజాయితీగా ఉండటంలోనే అసలైన సంతోషం ఉంటుందని..అదే అసలైన జీవితామని తనలో వచ్చిన రియలేజేషన్ గా పేర్కొన్నాడు. అప్పుడప్పుడు రాంగో పాల్ వర్మ కూడా చేసే వ్యాఖ్యలు అంతే ఆసక్తికరంగా ఉంటాయి.
