Begin typing your search above and press return to search.

పూరి - ప్రభాస్.. అంత డౌట్ ఎందుకు?

అయితే లేటెస్ట్ గా సినిమా షూటింగ్ సెట్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ మూమెంట్ హైలెట్ అయ్యింది. పాపులర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రొడ్యూసర్ చార్మీ కౌర్ ‘రాజాసాబ్’ సెట్స్‌కి ప్రత్యేక అతిథులుగా వచ్చారు.

By:  M Prashanth   |   30 July 2025 12:41 PM IST
పూరి - ప్రభాస్.. అంత డౌట్ ఎందుకు?
X

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ది రాజాసాబ్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. గత సినిమాల కన్నా భిన్నంగా, ఫ్యామిలీ, కామెడీ, హారర్ అంశాలతో భారీ స్కేల్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిధీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలయ్యేందుకు సినిమాను సిద్ధం చేస్తున్నారు.

అయితే లేటెస్ట్ గా సినిమా షూటింగ్ సెట్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ మూమెంట్ హైలెట్ అయ్యింది. పాపులర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రొడ్యూసర్ చార్మీ కౌర్ ‘రాజాసాబ్’ సెట్స్‌కి ప్రత్యేక అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ విజయ్ సేతుపతి హీరోగా ఓ నూతన చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నా, కొంత సమయం వెచ్చించి ప్రభాస్‌ని కలిసారు. చిరునవ్వులతో హాగ్ చేసుకొని సరదాగా స్పెండ్ చేశారు. సెట్స్‌లో ప్రభాస్ పూర్తి ఉత్సాహంలో, మిగతా టీమ్‌తో సరదాగా చిట్‌చాట్ చేస్తూ కనిపించారు. పూరి – ప్రభాస్ మధ్య స్నేహం మళ్లీ ఇలా ఫ్యాన్స్‌కి కికి ఇచ్చింది.


సరికొత్త డౌట్

ఇదిలా ఉంటే, పూరి జగన్నాథ్ అప్పుడప్పుడు కేవలం డైరెక్టర్ గానే కాకుండా, ప్రత్యేక పాత్రల్లో నటుడిగా కూడా వెండితెరపై మెరిసిన సందర్భాలు ఉన్నాయి. కెరీర్‌లో కొన్ని సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఆయన, ఫ్రెండ్స్‌కి, సహచరులకు సపోర్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇదే తరహాలో ‘రాజాసాబ్’ సెట్లో కనిపించడంతో, ఆయన ఈ సినిమాలో ఏదైనా గెస్ట్ రోల్ చేస్తున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం పూరి ప్రభాస్‌ను సరదాగా కలవడానికి మాత్రమే వచ్చారని తెలుస్తోంది.

పాత బంధం.. కొత్త జ్ఞాపకం

ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్‌కి ప్రత్యేక ఆకర్షణే. వీరిద్దరూ గతంలో ‘ఎక్ నిరంజన్’, ‘బుజ్జిగాడు’ లాంటి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో, మళ్లీ వీరిద్దరూ ఓసారి కలిస్తే బాగుంటుందని ఓ వర్గం అభిమానులు ఎప్పుడూ కోరుకుంటుంటారు. కానీ ప్రస్తుతం పూరి ఫ్లాప్స్ లో ఉండడంతో మరికొందరు వద్దనే అంటున్నారు. ఏదేమైనా ఇద్దరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో బిజీ షెడ్యూల్ మధ్య లో ఇలా సెట్స్‌పై కలవడం, ఆప్యాయంగా గడపడం సినిమా వర్గాల్లో పాజిటివ్ బజ్‌ను తీసుకొచ్చింది.

ఇంకా లైన్‌లో ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్

ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్‌తో బిజీగా ఉన్నా, మరిన్ని భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు. ముఖ్యంగా ‘కల్కి 2’, ‘స్పిరిట్’ లాంటి పాన్ ఇండియా సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ‘కల్కి’ మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో, రెండో పార్ట్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ‘స్పిరిట్’ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ అవుతుందని అంతా భావిస్తున్నారు. వీటితో పాటు ఇతర బడా దర్శకులతోనూ ప్రభాస్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు.