సమ్మర్ టార్గెట్ తో పూరీ..?
విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో సినిమా అంటే కచ్చితంగా ఆడియన్స్ లో సూపర్ బజ్ ఉంటుంది.
By: Ramesh Boddu | 21 Nov 2025 10:13 AM ISTఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు అసలేమాత్రం ఫాం లో లేడు. డబల్ ఇస్మార్ట్ సినిమాతో మరో డిజాస్టర్ ఫేస్ చేసిన పూరీ జగన్నాథ్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్న డౌట్ ఉంది. ఐతే దానికి ఆన్సర్ ఇస్తూ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా లాక్ చేసుకున్నాడు. విజయ్ సేతుపతి తన ప్రతి సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. అలాంటిది పూరీ అతన్ని ఒప్పించాడు అంటేనే సంథింగ్ స్పెషల్ గా ఉంది. ఐతే పూరీ ఈసారి తన ఒరిజినాలిటీ చూపించేలా విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.
పూరీ, విజయ్ సేతుపతి సినిమా ఆడియన్స్ లో సూపర్ బజ్..
విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో సినిమా అంటే కచ్చితంగా ఆడియన్స్ లో సూపర్ బజ్ ఉంటుంది. సినిమాలో తప్పకుండా మంచి కంటెంట్ తోనే వస్తుందని అనుకుంటారు. ఐతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి చాలా నెలలు అవుతున్నా సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఆమధ్య పూరీ బర్త్ డే సందర్భంగా టీజర్ వస్తుందని చెప్పారు కానీ అది కూడా ఎందుకో వదల్లేదు.
పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ సినిమాకు స్లమ్ డాగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తుంది. దాదాపు అదే టైటిల్ గా ఫిక్స్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఐతే ఈ సినిమాను అసలైతే ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ రిలీజ్ చేయాలని ప్రయత్నించారు. కానీ స్పీడ్ స్పీడ్ గా కానివ్వకుండా ఈసారి సూపర్ హిట్ టార్గెట్ తోనే సినిమా ఉండాలని పూరీ అండ్ టీం చాలా ఫోకస్ తో చేస్తున్నారట.
తెలుగులో మాస్ హిట్ కొట్టాలని..
తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ సినిమాను నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి ఆల్రెడీ స్టార్ సినిమాలు వస్తుండగా ఫిబ్రవరి, మార్చి రిలీజ్ లు కూడా లాక్ అయ్యాయి. అందుకే ఏప్రిల్, మే నెలల్లో పూరీ జగన్నాథ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాతో తెలుగులో కూడా మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
ఆల్రెడీ విజయ్ సేతుపతికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగినట్టుగానే పూరీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సో పూరీ, విజయ్ సేతుపతి కలిసి చేస్తున్న ఈ మూవీ సౌత్ ఆడియన్స్ కి ఒక మంచి ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. ఒక్కసారి పూరీ తన సూపర్ హిట్ ఫాం రోజులు గుర్తు చేస్తే మాత్రం ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. విజయ్ సేతుపతి, పూరీ గట్టి టార్గెట్ తోనే ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా సం యుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
