Begin typing your search above and press return to search.

పూరీ విజయ్ సేతుపతి.. ఏం జరుగుతుంది..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అందులో సంథింగ్ స్పెషల్ ఉండి తీరుతుంది.

By:  Ramesh Boddu   |   10 Nov 2025 10:16 AM IST
పూరీ విజయ్ సేతుపతి.. ఏం జరుగుతుంది..?
X

పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అందులో సంథింగ్ స్పెషల్ ఉండి తీరుతుంది. అందులోనూ ఫ్లాపుల్లో ఉన్న పూరీ జగన్నాథ్ లాంటి డైరెక్టర్ తో సినిమా అనేసరికి ఆడియన్స్ అంతా కూడా సర్ ప్రైజ్ అవుతున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఈ సినిమా చేస్తున్నారు. ఐతే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా ఉన్నారు మేకర్స్.

ఇండస్ట్రీ హిట్లు కొట్టిన పూరీ..

పూరీ సినిమా మొదలు పెట్టామా.. షూటింగ్ చేశామా.. రిలీజ్ చేశామా.. అన్నట్టుగా ఉంటుంది. పూరీ ఎలాంటి సినిమా చేసినా త్వరగానే చేస్తాడు. ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సినిమానే కాదు ఫ్లాపైన సినిమాలు కూడా పూరీ అదే సేమ్ వర్కింగ్ డేస్ లో పూర్తి చేస్తాడు. ఐతే డబల్ ఇస్మార్ట్ తర్వాత పూరీకి ఏ హీరో డేట్స్ ఇస్తాడా అని డౌట్ పడ్డారు. కానీ పూరీ జగన్నాథ్ తో విజయ్ సేతుపతి సినిమా అని అనౌన్స్ మెంట్ రాగానే ఆడియన్స్ షాక్ అయ్యారు.

ముందు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయినా ఆయన స్టోరీ సెలక్షన్, సినిమాల మీద ఉన్న జడ్జిమెంట్ తెలుసు కాబట్టి హోప్స్ తో ఉన్నారు. పూరీ, విజయ్ కాంబో సినిమాకు స్లమ్ డాగ్ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు ఒకప్పటి వర్కింగ్ స్టైల్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో అది వదల్లేదు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులతో..

విజయ్ సేతుపతి ఓ పక్క తమిళ్ సినిమాలు చేస్తూనే మరోపక్క ఈ సినిమాకు డేట్స్ ఇస్తున్నాడు. పూరీ జగన్నాథ్ తో సినిమా బాగా వస్తుందని సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని రీసెంట్ ప్రెస్ మీట్ లో విజయ్ సేతుపతి చెప్పారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐతే విజయ్ సేతుపతితో సినిమా మాత్రం తనని కంబ్యాక్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

మరి సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది. టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా రివీల్ చేయలేదు. ఐతే పూరీ ఈ సినిమాతో కెరీర్ మళ్లీ గాడిన పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే స్పీడ్ గా కాకుండా సినిమా అప్డేట్స్ విషయంలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారు.