Begin typing your search above and press return to search.

పూరీ నుంచి కంటెంట్ వచ్చేస్తుంది..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు సైతం అందుకున్న పూరీ జగన్నాథ్ ఈమధ్య అసలేమాత్రం ఫాం లో లేడు.

By:  Ramesh Boddu   |   26 Sept 2025 10:58 AM IST
పూరీ నుంచి కంటెంట్ వచ్చేస్తుంది..!
X

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు సైతం అందుకున్న పూరీ జగన్నాథ్ ఈమధ్య అసలేమాత్రం ఫాం లో లేడు. టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చినా మళ్లీ లైజర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో తన ఫ్లాప్ పంథా కొనసాగించాడు. ఐతే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరితో తెలుగు హీరోలు ఎవరు సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఆయన రాసుకున్న కథకు కోలీవుడ్ స్టార్ ని ఫిక్స్ చేసుకున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో పూరీ సినిమా వస్తుంది.


విజయ్ సేతుపతి సినిమా ఓకే చేశారంటే..

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ టాలెంట్ అండ్ సినిమాల స్టామినా తెలుసు కాబట్టి విజయ్ సేతుపతి ఈ సినిమా ఒప్పుకుని ఉండరు.. కేవలం ఆయన చెప్పిన కథ నచ్చడం వల్లే పూరీ ఫ్లాపుల్లో ఉన్నా కూడా సినిమా ఓకే చేశారు. ఇదే కాదు విజయ్ సేతుపతి ఒక సినిమా ఓకే చేశారంటే ఆయనకు స్టార్ డైరెక్టర్, క్రేజీ కాంబినేషన్ కన్నా కథ చాలా ఇంపార్టెంట్. ఆయన పాత్ర కథ నచ్చితే చాలు ఎలాంటి సినిమా అయినా ఎవరితో అయినా చేస్తాడు.

అలానే పూరీ ఫ్లాపుల్లో ఉన్నా కూడా విజయ్ సేతుపతి ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అందుకే పూరీ ఫ్యాన్స్ కోసం ఆయన బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు. విజయ్ సేతుపతిని పూరీ ఎలా చూపిస్తాడా అన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.

పూరీ జగన్నాథ్ బర్త్ డే..

ఈ సినిమా టైటిల్ టీజర్ ని ఈ నెల 28 పూరీ జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ మేకర్స్ వెల్లడించారు. పూరీ విజయ్ సేతుపతి సినిమా టైటిల్ అండ్ టీజర్ 28న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. పూరీ జగన్నాథ్ బర్త్ డే సందర్భంతో పాటు ఆయన దర్శకుడిగా టాలీవుడ్ లో పాతికేళ్లు పూర్తి చేసుకున్న టైం లో ఈ సినిమా వస్తుంది.

విజయ్ సేతుపతితో పూరీ చేసే సినిమా ఎలా ఉంటుందా అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది. కథ ఏమాత్రం బాగున్నా విజయ్ సేతుపతి అదరగొట్టేస్తాడు. విజయ్ పూరీ కాంబో సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి అఫీషియల్ టైటిల్ ఏంటో మరో 24 గంటల్లో తెలుస్తుంది. పూరీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అటు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ పై సూపర్ ఎజ్గైటెడ్ గా ఉన్నారు. ఈమధ్య సినిమాలు టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ మూవీ టీజర్ పూరీ మార్క్ చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.