పూరిని ఆపకపోతే ప్రమాదం!
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి కథనైనా క్రిస్పీగా చెబుతాడు.
By: Srikanth Kontham | 20 Nov 2025 8:31 AM ISTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి కథనైనా క్రిస్పీగా చెబుతాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పరుగులు పెట్టిస్తాడు. కటింగ్ కమర్శియల్ గా ఉంటుంది. కథలో అనవసరమైన సన్నివేశాలు..షాట్లు ఇరికించడు. తాను చెప్పాలనుకున్న పాయింట్ సింపుల్ గా ఎలాంటి గందరగోళం లేకుండా చెబుతాడు. ఇదే అతడి ప్రత్యేకత. చాలా వరకూ పూరి సినిమాలకు ఎడిటర్ గా పనిచేసింది మార్తాండ్ కె. వెంకటేష్. తాజాగా పూరి గురించి ఆయన ఓ ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేసారు. సాధారణంగా దర్శకులంతా ఎడిటింగ్ రూమ్ లో ఎడిటర్ తో పాటు ఉంటారు.
ఆయన సినిమాకు ఎడిటింగ్ సులభం:
కానీ పూరి మాత్రం అలా ఉండరన్నారు. ఎడిటర్లను పూరి నమ్ముతాడు. సినిమాను వాళ్ల మీద వదిలేసి వెళ్లిపోతాడు. తాను ఏం చెప్పాలనుకున్నది షూటింగ్ దశలోనూ పూర్తి చేస్తాడు. అక్కడే వేస్టేజ్ లేకుండా చేస్తాడు. దీంతో ఎడిటర్ కి కూడా పెద్దగా పని ఉండదు. అయితే కొన్ని సీన్స్ విషయంలో సింక్ మిస్ అవుతుందని చెబితే మాత్రం పూరి మాట వింటారన్నారు. పూరి గనకు ఎడిటర్ తో పాటు ఉంటే ఓ ప్లో వెళ్లిపోతుందన్నారు. కొన్నిసార్లు పూరిని ఆపాలని కూడా అన్నారు. అలా ఆపకపోతే ప్రమాదమంటూ పూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వాళ్లతో జర్నీ స్లోగా:
హీరో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలనుకుంటే? తర్వాత షాట్లో వైజాగ్ లో ఉంటాడు హీరో. కానీ మిగతా దర్శకుల చిత్రాల్లో అలా ఉండదు. మధ్యలో కొంత జర్నీ ఉంటుంది. దాన్ని హైలైట్ చేస్తారు. శేఖర్ కమ్ములా, బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల ఎడిటింగ్ అలాగే ఉంటుందన్నారు. వారిద్దరి నేరేషన్ స్లోగా ఉండటంతో ఎడిటింగ్ కూడా అలాగే ఉంటుందన్నారు. ఒక్కో దర్శకుడితో ఒక్కో శైలి ఉంటుంది. ఆ శైలిని బట్టి ఎడిటర్లు పని చేస్తుంటారు. పూరి ఎడిటర్లు, గీత రచియతలు, సినిమాటోగ్రాఫర్ల విషయంలో కొంత మందిని ఫిక్స్ చేసుకుని ఉంటారు.
నమ్మకస్తులతోనే డైరెక్టర్లు:
వీలైనంత వరకూ ఆ టీమ్ నే కొత్త సినిమాలకు పెట్టుకుంటారు. ఇలా పని చేయడం వల్ల దర్శకులకు పనిభారం తగ్గుతుంది. దర్శకుల విజన్ ఎలా ఉంటుందన్నది ఆ టీమ్ ముందే పట్టేస్తుంది కాబట్టి పనుల్లో జాప్యముండదు. అందుకే చాలా మంది దర్శకులు పాత సినిమాల ఆధారంగా కొత్త సినిమాలకు టీమ్ ను ఎంపిక చేస్తారు. సంగీత దర్శకుల విషయంలో మాత్రం కొన్ని రకాల మార్పులు జరుగుతుంటాయి. సుకుమార్ అయితే? దేవి శ్రీ ప్రసాద్ తో తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయరు. రాజమౌళి సినిమా చేస్తే కీరవాణి మాత్రమే సంగీతం అందించాలి.
