ఈ సీనియర్ డైరెక్టర్లు కంబ్యాక్ ఇస్తారా?
హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసే దుస్థితి నుంచి బయటపడి భారీ కంబ్యాక్ ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్న సీనియర్ దర్శకులపై ప్రత్యేక కథనం...
By: Gopi Velupala | 15 Oct 2026 9:28 AM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు క్యూ కట్టేవారు. అలాంటి దర్శకులు ఇప్పుడు ఒక్క విజయాన్ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే అవకాశం వస్తుంది. లేకపోతే కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసే దుస్థితి నుంచి బయటపడి భారీ కంబ్యాక్ ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్న సీనియర్ దర్శకులపై ప్రత్యేక కథనం...
పూరి జగన్నాధ్
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్...'బద్రి' సినిమాతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు...తెలుగు ఇండస్ట్రీలో హీరోల క్యారెక్టరైజేషన్ మీద కథలను రాయడంలో పూరి సిద్ధహస్తుడు. ఈ మధ్య కాలంలో పూరి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. దాంతో ఎలాగైనా సరే భారీ కంబ్యాక్ ఇవ్వాలని విజయ్ సేతుపతి తో 'స్లమ్ డాగ్' అనే సినిమాని చేశాడు. తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తే పూరి మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తాడు. లేకపోతే మాత్రం ఆయన పూర్తిగా డీలా పడిపోయే ప్రమాదం ఉంది...
శ్రీను వైట్ల
టాలీవుడ్ కమర్షియల్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు శ్రీనువైట్ల... తనదైన శైలిలో కామెడీ చేస్తూ సినిమా చూసే ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసేవాడు. కానీ కాలం మారుతున్న కొద్ది ఆయన కథల సెలెక్షన్ లో పెద్ద వైవిధ్యాన్ని చూపించకపోవడం రొటీన్ ఫార్ములా కామెడీని నమ్ముకోవడంతో ఆయనకి సక్సెస్ లు కరువయ్యాయి. ప్రస్తుతం శర్వానంద్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో సక్సెస్ ను సాధిస్తేనే శ్రీను వైట్ల మరోసారి తన స్టామినా ను చూపించిన వాడు అవుతాడు. లేకపోతే మాత్రం ఆయన కెరియర్ పూర్తిగా డైలమాలో పడిపోయే ప్రమాదం ఉంది.
హరీష్ శంకర్
'మిరపకాయ్' తో సక్సెస్ ని సాధించిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేసిన 'గబ్బర్ సింగ్' సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు అతనికి పెద్దగా సక్సెస్ లను సాధించి పెట్టలేదు. దాంతో ఆయన మరోసారి భారీ కంబ్యాక్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా చేసిన మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు నిరాశ పరిచాయి. దాంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నాడు.
బోయపాటి శ్రీను
కెరియర్ మొదట్లో భద్ర, తులసి, సింహ, లెజెండ్ సినిమాలతో సక్సెస్ లను సాధించిన బోయపాటి ప్రస్తుతం ఆ స్థాయి విజయాలను అందుకోలేపోతున్నాడు. బాలయ్యతో 'అఖండ' సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ రామ్ తో చేసిన 'స్కంద' ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఇక గత సంవత్సరం బాలయ్య బాబుతో చేసిన 'అఖండ 2' బోయపాటి కెరీర్ లోనే భారీ ఫ్లాప్ గా నిలిచింది. బోయపాటి ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడు ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడు అనేది తెలియాల్సి ఉంది...
