మళ్ళీ అమ్మ సెంటిమెంట్ తో పూరి.. ఏం చెప్పబోతున్నాడు?
వరుస అప్డేట్స్ తో హీరో బిచ్చగాడిగా ఎలా మారాడు అనే కోణంలో క్యూరియాసిటి క్రియేట్ చేస్తున్నాడు. 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే టైటిల్ తోనే తన మార్క్ చూపించాడు. ఇక లేటెస్ట్ గా మరో గ్లింప్స్ వదిలారు.
By: M Prashanth | 28 Sept 2026 12:05 PM ISTపూరీ జగన్నాథ్.. పేరు వింటేనే ఒక డిఫరెంట్ మేనరిజం, రా యాటిట్యూడ్ గుర్తొస్తాయి. ఆయన హీరోలు సమాజంతో గొడవ పడే విధానం చాలా కొత్తగా ఉంటుంది. కానీ ఈసారి పూరీ తన ట్రాక్ మార్చాడని తెలుస్తోంది. వరుస అప్డేట్స్ తో హీరో బిచ్చగాడిగా ఎలా మారాడు అనే కోణంలో క్యూరియాసిటి క్రియేట్ చేస్తున్నాడు. 'స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే టైటిల్ తోనే తన మార్క్ చూపించాడు. ఇక లేటెస్ట్ గా మరో గ్లింప్స్ వదిలారు.
ఇందులో హీరో యాటిట్యూడ్ కన్నా ఎక్కువగా, ఒక బలమైన మదర్ సెంటిమెంట్ చుట్టూ కథను తిప్పబోతున్నట్లు హింట్ ఇచ్చారు. పూరి సినిమాల్లో మదర్ సెంటిమెంట్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. చిరుత, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, లోఫర్, రోగ్, లైగర్.. ఇలా ఎక్కువ సినిమాల్లో అమ్మ ఎమోషన్ ను హైలెట్ చేశారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి జరీనా వహాబ్ తల్లిగా 'జుబేదా' అనే పాత్రలో నటిస్తున్నారు. విడుదలైన గ్లింప్స్‌లో ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేసిన విధానం గుండెను మెలిపెట్టేలా ఉంది.
ట్రైన్ కింద తలపెట్టి చనిపోదాం అనుకున్నా, ఆ ధైర్యం సరిపోలేదని, ఆకలితో ప్రాణాలు పోతుంటే ఆఖరికి తన చేతులు అడుక్కోవడానికి ముందుకొచ్చాయని జుబేదా పాత్ర చెప్పే డైలాగ్స్ చాలా బరువైన ఎమోషన్‌ను క్యారీ చేస్తున్నాయి. దీని తర్వాత విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే తల్లి కోసం ఏమైనా చేస్తాడా అనే క్యూరియాసిటి క్రియేట్ అయ్యింది. 'అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు' అని పూరి వాయిస్ ఓవర్ హైలెట్ అయ్యింది.
అంటే ఆకలి కోసం బిచ్చగత్తెగా మారిన ఒక తల్లి, ఆ తల్లి పడే బాధను చూడలేక రగిలిపోయే కొడుకు.. ఈ ఇద్దరి మధ్య పూరీ జగన్నాథ్ ఎలాంటి కథను రాశాడో అని ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కచ్చితంగా ఈసారి పూరీ తన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు ఒక గట్టి సెంటిమెంట్‌ను జోడించబోతున్నట్లు కనిపిస్తోంది. చివరగా ఇస్మార్ట్ శంకర్ లాంటి ఊర మాస్ సినిమాతో హిట్ కొట్టిన పూరీ, ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డాడు.
కానీ ఈసారి ఆ తప్పులు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ గ్లింప్స్ క్వాలిటీ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా పూరీ డైలాగ్స్‌లో ఉండే పదును ఈ వీడియోలోనూ తగ్గలేదు. ఛార్మి కౌర్, జేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరీ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. టబు కూడా ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
