పూరి చెప్పిన పెంగ్విన్ కథ నిజమే
దీని వెనుక ఓ గొప్ప ఎమోషనల్ స్టోరీ ఒకటుంది. అది తెలిస్తే? హృదయం ఉన్న ప్రతీ జీవి కన్నీరు కార్చడం ఖాయం. ఆ పెంగ్విన్ పక్షి ఒంటరిగా కొండ వైపుకు ఎందుకు వెళ్తుందంటే?
By: Srikanth Kontham | 24 Jan 2026 10:42 AM IST`పూరి మ్యాజింగ్స్` పేరుతో పూరి జగన్నాధ్ యూట్యూబ్ లో జీవిత సత్యాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఎన్నో అంశాలపై పూరి శైలిలో క్లాస్ లు తీసుకున్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మారిన వాళ్లు..మారుతున్న వాళ్లు..అనుసరిస్తున్న వాళ్లు ఎంతో మంది. రియలైజేషన్ కి సంబంధించి పూరి సూక్తులు నిజంగా ఎంతో కనెక్ట్ అవుతుంటాయి. పూరి జీవిత సత్యాలు ఎంతో నర్మగర్బం. అందుకే యువతని విపరీతంగా బాగా ఆకర్షిస్తుంటాయి.తాజాగా ఓ రెండు పెంగ్విన్ పక్షలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇది పాత వీడియో అయినా? పూరి చెప్పిన స్టోరీకి...ఆ రెండు పెంగ్విన్ పక్షల మధ్య గ్యాప్ కు పర్పెక్ట్ గా సింక్ అయింది. నిజంగా పూరి పెంగ్విన్ ల గురించి కూడా ఇంత అద్బుతంగా ఎలా చెప్పగలిగాడు అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే..ఆ పెంగ్విన్ వీడియో ఈనాటిది కాదు. 15 ఏళ్ల క్రితం నాటింది. ఆ వీడియో లో రెండు పెంగ్విన్ పక్షులుండగా అందులో ఒకటి ఒకే చోట ఆగిపోయింది. మరో పెంగ్విన్ మాత్రం మంచు కొండవైపు నడుచుకుంటూ వెళ్తోంది. నడిస్తే రెండు జంటగా నడవాలి. ఒకటే నడవడం ఏంటి? అని చాలా మందిలో సందేహం ఉంది.
దీని వెనుక ఓ గొప్ప ఎమోషనల్ స్టోరీ ఒకటుంది. అది తెలిస్తే? హృదయం ఉన్న ప్రతీ జీవి కన్నీరు కార్చడం ఖాయం. ఆ పెంగ్విన్ పక్షి ఒంటరిగా కొండ వైపుకు ఎందుకు వెళ్తుందంటే? అందుకు గల అసలు కథని పూరి జగన్నాధ్ గతంలోనే చెప్పాడు. ఆడ, మగ పెంగ్విన్ లలో మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ కి ఎంతో నమ్మకంగా, నిజాయితీగా ఉంటుందిట. ఆడ పెంగ్విన్ ని మగ పెంగ్విన్ తన భాగస్వామిగా అనుకుంటే? జీవితంలో చీట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆడ పెంగ్విన్ గనుక మోసం చేస్తే ఆ బాధని మగ పెంగ్విన్ ఎంత మాత్రం తట్టుకోలేదుట.
అప్పటి నుంచి ఆ రెండు పెంగ్విన్ లు కలిసి ఉండటాన్ని కష్టంగా భావిస్తాయట. దీంతో ఆడ పెంగ్విన్ ఆ జాతిని, సముద్రాన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోతుందిట. నుంచుని నుంచుని ఆకలతో అలమటించి కన్ను మూస్తుందిట. అంటే ఏదైనా తప్పు జరిగినా ? ఆ తప్పు తెలియనంత వరకే. తెలిసిన తర్వాత ఆడ పెంగ్విన్ రియలైజ్ అయినా? ఆ జాతి సమూహంలో మళ్లీ భాగం కావడం అసాధ్యం. సింగిల్ లైఫ్ ని సింగిల్ గానే లీడ్ చేయాలి. ఆ పెయిన్ తట్టుకోలేక తిండి లేక చనిపోతుందని గతంలో పూరి సూక్తుల్లో భాగంగా బయటకు వచ్చింది. ఇప్పుడా రెండు పెంగ్విన్ ల సన్నివేశం చూస్తుంటే? పూరి చెప్పింది పచ్చి వాస్తవం అని తేలింది.
