పూరీ టైమ్ తీసుకుంటున్నాడంటే..?
విజయ్ సేతుపతి ఒక సినిమా ఓకే చేశాడంటే మాత్రం అందులో కచ్చితంగా విషయం ఉంటుంది.
By: Ramesh Boddu | 16 Jan 2026 10:45 AM ISTటాలీవుడ్ లో పూరీ సినిమాలకు ఒక బ్రాండ్ ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన చరిత్ర ఆయనది. పూరీ సినిమా హీరో అంటే ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తాడు. కొన్నాళ్లుగా పూరీ తన మార్క్ సినిమా చేయలేక కెరీర్ లో వెనకపడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్నా కూడా మళ్లీ వరుస సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి డైరెక్షన్ లో సినిమా వస్తుంది. స్లమ్ డాగ్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాపై సూపర్ బజ్ ఉంది.
లైగర్, డబల్ ఇస్మార్ట్ ఫ్లాప్ తర్వాత..
మామూలుగా అయితే పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఇలా మొదలవుతుంది.. ఇలా పూర్తవుతుంది.. కానీ ఈసారి విజయ్ సేతుపతి సినిమా మాత్రం చాలా టైం తీసుకుంటున్నాడు. లైగర్, డబల్ ఇస్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడానికి ఏ హీరో అంత సుముఖత చూపించలేదు. ఐతే విజయ్ సేతుపతి మాత్రం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పై హోప్ పెట్టుకున్నాడు. పూరీ విజయ్ ఈ కాంబినేషన్ ని ఆడియన్స్ అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మరి పూరీ ఎలాంటి కథ చెప్పి విజయ్ సేతుపతిని ఒప్పించాడన్నది ఆసక్తికరంగా మారింది.
విజయ్ సేతుపతి ఒక సినిమా ఓకే చేశాడంటే మాత్రం అందులో కచ్చితంగా విషయం ఉంటుంది. పూరీ జగన్నాథ్ సినిమా అనగానే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తారు. ఐతే ఈసారి ఒకప్పటి పూరీని గుర్తు చేసేలా తన వర్కింగ్ స్టైల్ చూపిస్తున్నాడట పూరీ జగన్నాథ్. విజయ్ సేతుపతి సరసన సం యుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో విజయ్ సేతుపతి మరోసారి తన టాలెంట్ చూపించాలని చూస్తున్నాడు.
విజయ్ సేతుపతి తో పూరీ చేస్తున్న ఈ సినిమా..
విజయ్ సేతుపతి తో పూరీ చేస్తున్న ఈ సినిమా అసలైతే లాస్ట్ ఇయర్ రిలీజ్ అనుకున్నారు. ఐతే ఇప్పటివరకు సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ రాలేదు. ఈసారి ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా చేయాలనే ప్లానింగ్ తోనే పూరీ ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తుంది. పూరీ మార్క్ సినిమాగా ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది మూవీ వచ్చాకే తెలుస్తుంది.
విజయ్ సేతుపతి ఓ పక్క తమిళ్ సినిమాలు చేస్తూ తెలుగులో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక రోల్ చేసిన విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో శేషారాయణం సినిమాలో నటించాడు. ఇక పూరీ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. విజయ్ సేతుపతి సినిమాతో పూరీ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అదే జరిగితే మాత్రం పూరీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్టే అవుతుంది.
