Begin typing your search above and press return to search.

పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?

పూరి జగన్నాథ్ చిరంజీవి కోసం ‘ఆంధ్రావాలా’ కథను సిద్ధం చేయగా, అనివార్య కారణాలతో ఆ సినిమా ఎన్టీఆర్‌తో తెరకెక్కిందని టాక్. చిరంజీవి రీ ఎంట్రీ సమయంలో ‘ఆటో జానీ’ కథ కూడా చెప్పినా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పటికీ మెగాస్టార్‌తో సినిమా చేయాలన్నది పూరి కలగా ఉంది.

By:  Gopi Velupala   |   25 Nov 2026 9:33 AM IST
పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?
X

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్... ప్రస్తుతం టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లందరిని స్టార్ హీరోలుగా మార్చిన ఘనత పూరి జగన్నాధికే దక్కుతుంది... పూరి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నప్పటికి ఆయనకు అనుకున్న సక్సెస్ అయితే రావడం లేదు... విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో 'స్లమ్ డాగ్' సినిమా చేశాడు. ఈ మూవీ తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది...

చిరంజీవి కోసం రాసిన కథను ఆ హీరోతో చేశాడా?

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం పూరి జగన్నాథ్ కల.. తను చదువుకుంటున్న రోజుల్లో డైలీ చిరంజీవి సినిమా చూసి వచ్చేవాడు. అలాంటి పూరీ జగన్నాథ్ చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్స్ గా మారిపోయాడు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో ఆయనతో సినిమా చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు... జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన 'ఆంధ్రావాలా' సినిమా కథని మొదటి చిరంజీవి కోసం రాసుకున్నారట. దాన్ని చిరంజీవికి వినిపించారు కానీ అనుకోని కారణాల వల్ల చిరంజీవి ఆ సినిమాని చేయలేకపోయాడు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి చేసిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

నిజానికి తండ్రి కొడుకు రెండు పాత్రలను ఎన్టీఆర్ చేయడం వల్ల కొడుకు పాత్ర పర్లేదు కానీ, తండ్రి పాత్రకి అతని ఏజ్ సరిపోలేదు అందుకే ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఒకవేళ చిరంజీవి చేసి ఉంటే ఆ సినిమా ప్రేక్షకులకు సూపర్ గా నచ్చి ఉండేదేమో రెండు పాత్రలకు ఆయన బాగా సెట్ అయ్యేవారు. అప్పటి నుంచి పూరి జగన్నాథ్ అవకాశం దొరికిన ప్రతిసారి చిరంజీవి తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికి అది వర్కౌట్ కావడం లేదు.

చిరంజీవి రీ ఎంట్రీ లో పూరి కథ వర్కౌట్ కాలేదు..

చిరంజీవి రీ ఎంట్రీ సమయంలో పూరి జగన్నాథ్ ఆటో జానీ అనే కథ చెప్పాడు. చిరంజీవికి ఫస్టాఫ్ బాగా నచ్చింది కానీ సెకండాఫ్ అనుకున్నంత గా లేదట.దాంతో ఆ మూవీ సెట్స్ మీదకి వెళ్లలేదు. ఇప్పుడు అవకాశం వచ్చిన చిరంజీవి తో పక్కా కమర్షియల్ సినిమా చేసి హిట్ కొట్టడానికి పూరి జగన్నాథ్ రెడీ గా ఉన్నాడు. కానీ ప్రస్తుతం పూరి ఫ్లాప్ ల్లో ఉన్నాడు కాబట్టి చిరంజీవి సినిమా ఇవ్వడం కష్టమే... రాబోయే రోజుల్లో అయిన పూరి విజయాలను సాధించి చిరంజీవి ని డైరెక్ట్ చేస్తాడేమో చూద్దాం...