బ్యాంకాక్ వెళ్లకుండా రాసిన స్టోరీ!
ఈ కథని పూర్తిగా ముంబై కి బాండ్ అయి రాసినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సిటీలోనే ఓ స్టార్ హోటల్ లో తానొక్కడే సింగిల్ గా కూర్చుని రాసాడుట.
By: Sivaji Kontham | 18 Sept 2025 8:45 AM ISTపూరి జగన్నాధ్ ఏ సినిమా స్టోరీ రాయలన్నా బ్యాంకాక్ బీచ్ లో రాయడం అలవాటు. డైరెక్టర్ గా సక్సెస్ అయిన తర్వాత పూరి బ్యాంకాక్ ను అడ్డాగా మార్చుకుని స్క్రిప్ట్ పనులు చక్కబెడుతున్నారు. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు తిరిగినా? బ్యాంకాక్ బీచ్ లో కూర్చోనిదే పూరి కలం కదలదు. ఆయన కథలన్ని అక్కడ నుంచే పుట్టాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాంకాక్ నే ఓ సెంటిమెంట్ గా మార్చుకుని రెండు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. అయితే తాజా సినిమా స్టోరీ మాత్రం బ్యాంకాక్ లో సిద్దమైన స్టోరీ కాదని వినిపిస్తోంది.
ఆ రెండు సినిమాల్లా:
ఈ కథని పూర్తిగా ముంబై కి బాండ్ అయి రాసినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సిటీలోనే ఓ స్టార్ హోటల్ లో తానొక్కడే సింగిల్ గా కూర్చుని రాసాడుట. ఈ సినిమాకు `బెగ్గర్` అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారంలో ఉంది. తొలి నుంచి ఇది పూరి మార్క్ కి భిన్నమైన స్క్రిప్ట్ అని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ సన్నిహితుల మాత్రం పూరి మార్క్ కంటెంట్ గా చెబుతున్నారు. బెగ్గర్ కథని తన స్టైల్లో పవర్ పుల్ గా చెబుతున్నట్లు మాట్లాడుకుంటున్నారు. `పోకిరి`, `బిజినెస్ మెన్` తరహా స్క్రీన్ ప్లే తో కథ సాగుతుందని అంటున్నారు.
ముంబై టూ హైదరాబాద్:
ఈ కథని, పూరిని మాత్రమే విజయ్ సేతుపతి ఎంతో ప్రేమించి పని చేస్తున్నారు. ఓ సమావేశంలో పూరి గత సినిమాలు చూసానని...ఆయన డైలాగులు పవర్ పుల్ గా ఉంటాయని..అవి తనని ఎంతగానో ఆకట్టుకోవడంతోనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇది పూరి మార్క్ కంటెట్ అనే మాటకు మరింత బలం చేకూర్చుతుంది. మరి ఈ ప్రచారంలో నిజానిజాలు తేలాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సిటీలోని అల్యుమినియం ఫ్యాక్టరీలో విజయ్ సేతుపతి సహా ప్రధాన పాత్ర ధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఫ్యాక్టరీ ఓ సెంటిమెంట్:
పూరి సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు అల్యుమినియం ఫ్యాక్టరీలో షూట్ చేయడం తొలి నుంచి అలవాటు. ఆయన ఏ సినిమా చేసినా అక్కడ ఓ యాక్షన్ సన్నివేశామైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలక సన్నివేశాలకు మరోసారి ఫ్యాక్టరీ వేదిక అయింది. ఈ సినిమా విజయం పూరికి అత్యంత కీలకం. వరుస పరాజయాల నేపథ్యంలో స్టార్ హీరోలంతా పూరి దూరమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కసితో పని చేస్తున్నారు.
