ఎంగేజ్మెంట్ చేసుకున్న పునర్నవి.. ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరంటే?
పునర్నవి భూపాలం.. తెలుగు ఆడియన్స్ కు ఎంతో సుపరిచితురాలు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ తో మొదలైన ఆమె జర్నీ, బిగ్ బాస్ అనే రియాలిటీ షో తర్వాత విపరీతమైన గుర్తింపు అందుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 20 Feb 2026 11:56 AM ISTపునర్నవి భూపాలం.. తెలుగు ఆడియన్స్ కు ఎంతో సుపరిచితురాలు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ తో మొదలైన ఆమె జర్నీ, బిగ్ బాస్ అనే రియాలిటీ షో తర్వాత విపరీతమైన గుర్తింపు అందుకున్నారు. ఇప్పుడు పునర్నవి లైఫ్ లో మరో కొత్త జర్నీ మొదలవబోతోంది. రీసెంట్ గా పునర్నవి తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన స్టోరీలు చూస్తుంటే క్లారిటీ వస్తోంది.
బిగ్‌బాస్3తో పునర్నవికి మంచి ఫాలోయింగ్
ఉయ్యాల జంపాల మూవీలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించిన పునర్నవి, ఆ సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతోనే అమ్మడికి తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఆ అవకాశాల వల్ల పునర్నవికి ఏమంత లాభం లేకుండా పోయింది. అయితే బిగ్‌బాస్3 మాత్రం పునర్నవి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది.
బిగ్‌బాస్ లో రాహుల్ తో క్లోజ్ గా..
బిగ్ బాస్ లో ఉన్నంత కాలం సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె సన్నిహితంగా ఉండటం అప్పట్లో బాగానే వార్తల్లో నిలిచింది. కానీ ఆ షో తర్వాత మాత్రం వారిద్దరి రిలేషన్ కంటిన్యూ అవలేదు. రాహుల్ ఇటీవలే పెళ్లి చేసుకోగా, పునర్నవి కూడా తన లైఫ్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే తన లైఫ్ పార్టనర్‌ను అఫీషియల్ గా అందరికీ పరిచయం చేసిన పునర్నవి ఇప్పుడు అతనితో నిశ్చితార్థం చేసుకున్నారు.
హేమంత్ వర్మతో పునర్నవి నిశ్చితార్థం
ఫిబ్రవరి 19న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పునర్నవి- హేమంత వర్మ నిశ్చితార్థం జరిగినట్టు పునర్నవి ఇన్‌స్టా స్టోరీస్ చూస్తుంటే అర్థమవుఉంది. నిశ్చితార్థంతో పాటూ సంప్రదాయబద్ధంగా లగ్న పత్రిక కూడా రాసుకుని ఈ వేడుకను ఘనంగా నిర్వహించినట్టు తెలుస్తోంది. కాగా పునర్నవి షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా సింపుల్ గా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
చాలా కాలంగా హేమంత్ ప్రేమలో పునర్నవి
ఎంగేజ్‌మెంట్ ఫోటోల్లో బ్లూ కలర్ శారీలో పునర్నవి చాలా సింపుల్ గా కనిపిస్తూనే మరింత అందంగా మెరిసిపోయింది. ఇక పునర్నవి చేసుకోబోయే అబ్బాయి విషయానికొస్తే అతని పేరు హేమంత. వృత్తి రీత్యా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ప్రకృతి మధ్య జీవితాన్ని గడిపే అతని ఇన్‌స్టా ప్రొఫెల్ చూస్తే ట్రావెలింగ్, ఫోటోగ్రఫీ అంటే అతనికి బాగా ఇష్టమని తెలుస్తోంది. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో పునర్నవి ఫోటోలు చూసి ఆమెకు పలువురు విషెస్ చెప్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ కు వెళ్లొచ్చిన రాహుల్ మొన్నీమధ్య పెళ్లి చేసుకోగా, ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అవడం విశేషం.
