Begin typing your search above and press return to search.

దీపావళి స్పెషల్.. దీపాల వెలుగుల్లో పూజిత!

ఈ క్రమంలోనే తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రముఖ బ్యూటీ పూజిత పొన్నాడ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

By:  Madhu Reddy   |   20 Oct 2025 12:00 AM IST
దీపావళి స్పెషల్.. దీపాల వెలుగుల్లో పూజిత!
X

ఏదైనా అకేషన్ వచ్చిందంటే చాలు సెలబ్రిటీలు చాలా అందంగా .. సాంప్రదాయంగా ముస్తాబయి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.. ఇక నిన్న మొన్నటి వరకు దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి గెటప్పుల్లో కనిపించి అందరినీ అబ్బురపరిచిన ఈ భామలు ఇప్పుడు దీపావళి స్పెషల్ అంటూ దీపావళి మొత్తం తమ కళ్ళల్లోనే ఉంది అన్నట్టు నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపావళి స్పెషల్ సందర్భంగా మరింత అందంగా ముస్తాబయి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రముఖ బ్యూటీ పూజిత పొన్నాడ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. గ్రీన్ కలర్ చీర కట్టుకొని.. గోల్డెన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన అందాలతో అందరినీ అబ్బురపరిచింది. ముఖ్యంగా నడుము అందాలు హైలైట్ చేస్తూ పూజిత పొన్నాడ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సెల్ఫీలు దిగుతూ.. దీపావళి మొత్తం తన ఇంట్లోనే అన్నట్టుగా ఆ ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పూజిత పొన్నాడ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫాలోవర్స్, నెటిజన్స్ హార్ట్, స్మైలీ ఎమోజీలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.

పూజిత పొన్నాడ కెరియర్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. తండ్రి ఉద్యోగరీత్యా చెన్నై, ఢిల్లీ వంటి నగరాలలో పెరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూజిత టాటా కన్సల్టెన్సీలో కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. సినిమాల మీద ఉన్న ఇష్టంతోనే ఉద్యోగాన్ని కూడా పక్కనపెట్టి సినిమా రంగం వైపు అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ.


అందులో భాగంగానే మొదట మోడలింగ్ రంగంలోకి అడుగులు వేసిన పూజిత.. ఆ తర్వాత 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది. 2016 లో వచ్చిన బైలింగ్వల్ చిత్రం ఊపిరి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత దర్శకుడు, రంగస్థలం, రాజుగాడు, బ్రాండ్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు చాలా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


తెలుగులోనే కాకుండా తమిళ్ భాషలలో కూడా అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే గత ఏడాది తమిళ్ చిత్రాలలో నటించిన ఈమె.. ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. అలాగే ఒక తమిళ్ సినిమాలు కూడా అవకాశం లభించినట్లు సమాచారం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన పూజిత హీరోయిన్ గా అడుగులు వేసి సక్సెస్ అందుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.