ప్లాప్ చిత్రం తర్వాత హీరో పారితోషికం రెట్టింపు!
ఇద్దరి కాంబినేషన్లో గతంలో `పులి` అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. దళపతి కెరీర్ లో అప్పటికి ఇదే తొలి భారీ బడ్జెట్ చిత్రం కూడా.
By: Srikanth Kontham | 27 Aug 2025 10:30 AM ISTఏ హీరోకైనా ప్లాప్ పడితే మార్కెట్ డౌన్ అవుతుంది. దీంతో పారితోషికం డిమాండ్ చేయడం తగ్గుతుంది. ఇలాంటి సన్నివేశం ఒక్క సినిమాకే తలెత్తదు. వరుసగా ప్లాప్ లు ఎదురైతే అది హీరో మార్కెట్ పై ప్రభావం చూపుతుంది. అటుపై హీరో కూడా డౌన్ అవుతాడు. అప్పుడు హీరో అడిగినంత నిర్మాత చెల్లించే పరిస్థితి ఉండదు. హీరోల పారితోషికం పడపోయిందంటే? తెరపైకి వచ్చే ప్రధాన కారణం ఇదే అవుతుంది. అయితే కోలీవుడ్ నిర్మాత పిటి సెల్వ కుమార్ స్టార్ హీరో విజయ్ పారితోషికం విషయంలో ఓకొత్త వాదన తెరపైకి తెచ్చాడు.
తొలి షోతోనే డిజాస్టర్:
ఇద్దరి కాంబినేషన్లో గతంలో `పులి` అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. దళపతి కెరీర్ లో అప్పటికి ఇదే తొలి భారీ బడ్జెట్ చిత్రం కూడా. ఎస్. కె స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమిన్స్, సెల్వకుమార్ సం యుక్తంగా నిర్మించిన చిత్రమిది. చింబు దేవన్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి, సుదీప్, హన్సిక లాంటి స్టార్స్ తోభారీ కాన్వాస్ పై తెరకెక్కిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య 2015 లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. తొలి షోతోనే డిజాస్టర్ గా తేలిపోయింది.
కుట్ర అంటూ ఆరోపణ:
దీంతో నిర్మాతలు, పంపిణీ దారులు, బయ్యర్లు అంతా తీవ్రంగా నష్టపోయారు. కానీ ఏ నాడు ఈ విషయం బయటకు రాలేదు. ఈ నేపథ్యలో తాజాగా సెల్వ కుమార్ లబోదిబో మంటూ మీడియా ముందుకొచ్చాడు. సినిమా ప్లాప్ అయి తాను నష్టపోతే హీరో విజయ్ కి మాత్రం ఆ ప్లాప్ తర్వాత డబుల్ పారితోషికం వచ్చింద న్నారు. సినిమా కోసం తాను ఆస్తులు అమ్మకుంటే విజయ్ నుంచి కనీసం ఓదార్పు కూడా లేదన్నారు. సిని మా రిలీజ్ కు ముందు జరిగిన ఐటీ దాడుల వెనుక తన పక్కనే ఉన్న వారే కుట్ర చేసారని ఆరోపించారు.
విజయ్ కి దూరంగా:
ఎలైగైనా సినిమా విడుదల అడ్డుకోవాలని అప్పుడే రాజకీయంగా పావులు కదిపారన్నారు. ఆ సినిమా ప్లాప్ తర్వాత విజయ్ కూడా తనని దూరం పెట్టారన్నారు. వారం రోజుల పాటు, అతడితో మాట్లాడే అవకాశం కూడా రాలేదన్నారు. సినిమాకు పెట్టుబడి పెట్టే నిర్మాత అంటే కొందరు హీరోలకు అంత చులకనగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఇంత కాలం సైలెంట్ గా ఉన్న సెల్వ కుమార్ ఇప్పుడే తెర మీదకు ఎందుకొచ్చినట్లు? అన్న ప్రశ్నలు తలె త్తుతున్నాయి.
