Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సై అంటే మిత్ర‌న్ రంగంలోకి!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల లైనప్ గురించి నిత్యం సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది.

By:  Srikanth Kontham   |   24 Aug 2026 8:00 AM IST
మెగాస్టార్ సై అంటే మిత్ర‌న్ రంగంలోకి!
X

మెగాస్టార్ చిరంజీవి సినిమాల లైనప్ గురించి నిత్యం సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా అన్న‌య్య పుట్టినరోజు సందర్భంగా వెలువడిన అప్‌డేట్లతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. చిరంజీవితో సినిమా చేసేందుకు తాను ఓ కథ సిద్ధం చేశానని, ఆ స్క్రిప్ట్ ఇంకా తన దగ్గరే ఉందని వెల్లడించారు.`స‌ర్దార్` చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీఎస్ మిత్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.

మెగాస్టార్ హీరోగా నటించిన `విశ్వంభర` చిత్రం తర్వాత చిరంజీవితో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయడానికి కథ చెప్పినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో ఇద్దరి డేట్స్ కుదరకపోవడం, ఇతర కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని వివరించారు. అయితే చిరంజీవి కోసం రాసిన కథ ఇప్ప‌టికీ అలాగే ఉంద‌ని మిత్రన్ స్పష్టం చేశారు. తాను హీరో యశ్ కోసం రాసిన స్క్రిప్ట్‌కు, చిరంజీవికి వినిపించిన కథకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఆ కథ వేరే ప్రాజెక్టుకు సంబంధించినదని, చిరంజీవి కోసం తయారు చేసిన ప్రత్యేకమైన స్క్రిప్ట్ మాత్రం ఇప్పటికీ భద్రంగా తన దగ్గరే ఉంద‌న్నారు.

ఈ క‌థ తెర‌కెక్క‌పోయినా? భవిష్యత్తులో మెగాస్టార్‌తో పనిచేసే అవకాశంపై ఆశాభావం వ్య‌క్తం చేసారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రానికి మద్దతు ఇస్తూనే అదే ప్రముఖ నిర్మాణ సంస్థ బ్యానర్‌లోనే చిరంజీవితో సినిమా ఉంటుంద‌న్నారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్ మిత్రన్ కార్తీ హీరోగా స్పై థ్రిల్లర్ `స‌ర్దార్2` పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది.

అనంత‌రం చిరంజీవి మెచ్చిన క‌థ‌తో మిత్ర‌న్ సినిమా చేసే అవ‌కాశం ఉంది. అలాగే చిరంజీవి కూడా దర్శకుడు బాబీ కోల్లి దర్శకత్వంలో `కాకా` చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు వ‌శిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్న `విశ్వంభర` రిలీజ్ ప్ర‌క‌టిస్తే ఆ సినిమా కు సంబంధించి ప్ర‌చారం ప‌నుల్లోనూ చిరు బిజీ అవుతారు. ఈ పరిణామాలన్నీ గ‌మ‌నిస్తే? ప్రస్తుతానికి ఇద్దరూ తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా? రాబోయే రోజుల్లో పీఎస్ మిత్రన్ - చిరంజీవి కలయికలో సినిమా వచ్చే అవకాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.

మెగాస్టార్ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబినేష‌న్ కోసం ఆస‌క్తి చూస్తున్నారు? అన్న‌ది అంతే నిజం. వైవిథ్య‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమాలు చేయ‌డం మిత్ర‌న్ ప్ర‌త్యేక‌త‌. రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా మిత్ర‌న్ సినిమా లుంటాయి. ఇంటెన్స్ యాక్ష‌న్ ..స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రాలు తెరకెక్కించ‌డంలో మిత్ర‌న్ మాస్ట‌ర్. అలాంటి మేక‌ర్ కు చిరు తోడైతే? ఆ కాంబినేష‌న్ నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.