Begin typing your search above and press return to search.

చిరు కటౌట్ కు మిత్రన్ కథ పడితే!

సరిగ్గా ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ పీఎస్ మిత్రన్ పేరు బయటకు రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మిత్రన్ ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ సినిమాలు తీయడు.

By:  M Prashanth   |   22 Aug 2026 10:11 AM IST
చిరు కటౌట్ కు మిత్రన్ కథ పడితే!
X

చిరంజీవి రీసెంట్ గా ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ చూస్తే ఒకే జానర్ కు ఫిక్స్ కావడం లేదనిపిస్తుంది. మొన్నటి మన శంకర వరప్రసాద్ గారితో ఫ్యామిలీ ఆడియన్స్ ను నవ్వించి సాలిడ్ హిట్ కొట్టారు. అటు విశ్వంభరతో ఫాంటసీ ప్రపంచంలోకి వెళ్లారు. ఇప్పుడు డైరెక్టర్ బాబీతో చేస్తున్న సినిమాలో పక్కా మాస్ యాక్షన్ తో రాబోతున్నారు. చిరు కమర్షియల్ యాంగిల్ లో మెప్పిస్తున్నారు కానీ అందులో ఇమేజ్ కు తగ్గ కంటెంట్ తో వచ్చి చాలా రోజులైంది.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ పీఎస్ మిత్రన్ పేరు బయటకు రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మిత్రన్ ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ సినిమాలు తీయడు. జనాలకు తెలిసిన ఒక సమస్యను తీసుకుని దానికి యాక్షన్ ఎలిమెంట్స్ అద్దుతాడు. అభిమన్యుడులో సైబర్ క్రైమ్ గురించి చెప్పాడు. హీరోలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ను టచ్ చేశాడు. సర్దార్ లో ఏకంగా వాటర్ మాఫియాను తెరపైకి తెచ్చాడు. ప్రస్తుతం సర్దార్ 2తో డేటా, టెక్నాలజీ వార్ ను టచ్ చేస్తున్నాడు.

ఇలా ఒక సోషల్ పాయింట్ కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేయడం ఆయన స్పెషాలిటీ. చిరంజీవి కెరీర్ లో కూడా ఇలాంటి సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఠాగూర్ లో కరప్షన్ మీద, స్టాలిన్ లో హెల్పింగ్ నేచర్ మీద వచ్చిన కాన్సెప్ట్స్ ను కమర్షియల్ గా భలేగా ప్రెజెంట్ చేశారు. చిరు లాంటి పెద్ద కటౌట్ స్క్రీన్ మీద యాక్షన్ చేస్తుంటే దాని వెనుక ఒక బలమైన సోషల్ రీజన్ ఉంటే ఇంపాక్ట్ ఇంకాస్త గట్టిగా ఉంటుంది.

మిత్రన్ టేకింగ్ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. కానీ మిత్రన్ కథలు ఎప్పుడూ ఒకేలా క్లిక్ అవుతాయని చెప్పలేం. సోషల్ పాయింట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కమర్షియల్ ఫ్లో మిస్ అయితే రిజల్ట్ తేడా కొట్టే ఛాన్స్ ఉంటుంది. అందులోనూ చిరంజీవితో సినిమా అంటే ఆయన వయసు, స్టార్ డమ్, ఫ్యాన్స్ అంచనాలు ఇలా చాలా లెక్కలు చూసుకోవాలి.

వాటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మిత్రన్ పర్ఫెక్ట్ గా స్టోరీ రెడీ చేస్తే మాత్రం అది ఆయనకు కూడా ఒక పెద్ద స్కేల్ ప్రాజెక్ట్ అవుతుంది. విశ్వంభర తర్వాత చిరుతో తాను సినిమా చేయాల్సిందని మిత్రన్ రీసెంట్ గా స్వయంగా చెప్పారు. చిరుకు కథ కూడా వినిపించానని, కానీ అప్పుడు ఇద్దరి డేట్స్ కుదరకపోవడం వల్లే ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిందని క్లారిటీ ఇచ్చారు.

దీన్ని బట్టి చూస్తే ఈ కాంబినేషన్ పూర్తిగా క్యాన్సిల్ అయిందని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి చిరంజీవి చేతిలో చాలా సినిమాలున్నాయి. అటు మిత్రన్ కూడా తన కమిట్మెంట్స్ తో బిజీగానే ఉన్నాడు. కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా వీళ్లిద్దరి టైమ్ సెట్ అయితే మాత్రం కచ్చితంగా సినిమా ఉండే అవకాశం ఉంది. రొటీన్ మాస్ కథలకు భిన్నంగా చిరు కటౌట్ కు మిత్రన్ సోషల్ థ్రిల్లర్ పాయింట్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఆ కిక్ వేరే లెవల్ లో ఉంటుంది.