నాని కోసం బాలీవుడ్ నుంచే దిగారా?
నేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా నాని నటిస్తోన్న సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి.
By: Srikanth Kontham | 6 Nov 2025 7:00 PM ISTనేచురల్ స్టార్ నాని పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా నాని నటిస్తోన్న సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి. మంచి వసూళ్లతో నిర్మాతలకు కాసుల పంట పండుతోంది. `దసరా`, `హాయ్ నాన్న`, `సరిపోదా శనివారం,` హిట్ ది థర్డ్ కేస్` తో వరుసగా నాలుగు విజయాలు అందుకున్నాడు. మరో రెండు విజయాలు నమోదైతే డబుల్ హ్యాట్రిక్ నమోదవుతుంది. ఆ ప్లానింగ్ దిశగానే నాని కమిట్ మెంట్లు జరుగుతున్నాయి. అందుకే మళ్లీ `దసరా` దర్శకుడినే రిపీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో `ది ప్యారడైజ్` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
నాని చుట్టూ నిర్మాతలు:
ఇది పూర్తయిన వెంటనే యంగ్ డైరెక్టర్ సుజిత్ ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఇటీవలే సుజిత్ `ఓజీ`తో భారీ యాక్షన్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా డైరెక్టర్ల లిస్ట్ కనిపిస్తుంది. మరి నిర్మాతలు అడ్వాన్సులు ఇవ్వడానికి క్యూలోనే ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే నానికి చాలా మంది నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. కానీ ఏ బ్యానర్లో ఎప్పుడు సినిమా చేస్తాడు? అన్నది ఇంకా క్లారిటీ లేదు. వారందరికీ ఓ ఆర్డర్ ప్రకారం డేట్లు కేటాయిస్తాడు. అప్పుడికప్పుడు ఇనిస్టెంట్ గా డేట్లు ఇచ్చే నిర్మాతలు కొందరు ఉంటారు.
బాలీవుడ్ నుంచి దిగారా?
అలాంటి వారి నుంచి అడ్వాన్స్ తీసుకుంటే మాత్రం డేట్లు ఇవ్వడంలో పెద్దగా జాప్యం చేయడు. లైన్ లో ఉన్న సినిమాలు చూసుకుని డేట్లు ఇస్తుంటాడు. ప్రస్తుతం నాని నుంచి ఓ ఇద్దరు నిర్మాతలు అలాగే డేట్లు లాక్ చేయాలనే ప్లాన్ తో ఉన్నట్లు తెలిసింది. `జఠాధర` సినిమాతో వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైశ్వాల్ నిర్మాతలుగా లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. వీరు ఇంత వరకూ టాలీవుడ్ లో సినిమాలు నిర్మించలేదు. `జఠాదర` తొలి సినిమా. వీళ్లు ఎక్కడ నుంచి వచ్చారంటే? బాలీవుడ్ నుంచి వచ్చారని తేలింది.
ఇద్దరు హీరోలతో సినిమాలు:
ఈ విషయాన్ని సుధీర్ బాబు తెలిపారు. తనతోనూ, నానితోనూ సినిమాలు నిర్మించాలనే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. నానితో తో మాత్రం ఓ భారీ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నారుట. అది పాన్ ఇండియాలో ఉంటుందని తెలిసింది. స్టోరీ ఇంకా లాక్ అవ్వలేదు గానీ..`నాని`ని సదరు నిర్మాతలు దాదాపు లాక్ చేసినట్లేనని సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
