ఇండస్ట్రీలో సమస్య తీరే వరకు మాల తీయను -నిర్మాత ఎస్కేఎన్
ఇదిలా ఉండగా తాజాగా 12 మంది నిర్మాతలతో ఇండస్ట్రీ సమస్యలపై.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించారు.
By: Madhu Reddy | 11 Aug 2025 3:31 PM ISTగత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తలెత్తిన సమస్యలు అటు సినిమా షూటింగ్లకు అంతరాయాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. సినీ కార్మికుల వేతనాల పెంపుపై అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్స్ మధ్య వివాదం నెలకొంది. అటు తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె కారణంగా షూటింగులు కూడా నిలిచిపోయాయి. పైగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ 30% వేతన పెంపు డిమాండ్ తో సమ్మె ప్రకటించడంతో.. ఈ సమస్యపై చర్చించేందుకు అటు నిర్మాతలు కూడా పలువురు సినీతారలను కలుస్తున్నారు. అయినా సరే ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా తాజాగా 12 మంది నిర్మాతలతో ఇండస్ట్రీ సమస్యలపై.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఒక్కొక్క నిర్మాత కార్మికుల డిమాండ్ తగ్గట్టుగా తమ వాదనలను కూడా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత ఎస్ కే ఎన్ ప్రెస్ మీట్ వేదికగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రెస్ మీట్ లో భాగంగా ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. "మా మధ్య ఎటువంటి గ్రూప్ యిజం లేదు. మాట్లాడడానికి మాటలు...భావవ్యక్తీకరణ చేయడానికి పెదాలు తప్ప ఇంకేం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ రైట్స్ గురించి మాట్లాడుతున్నారే.. కానీ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడటం లేదు. అయితే నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను కాబట్టి చాలామంది నన్ను టార్గెట్ చేస్తూ వందల కోట్లు సినిమాలు పెట్టి సినిమాలు తీస్తారు కదారా అంటున్నారు. కానీ మేము ఎవరు కూడా వందల కోట్లు పెట్టి సినిమాలు చేయడం లేదు.
అలాగే టికెట్ పెంపు కూడా లేదు. మేము కూడా ఇండస్ట్రీలో ఒక భాగమే. సంవత్సరానికి 250 సినిమాలు తీస్తే.. అందులో 200 సినిమాలు చిన్న సినిమాలు, మధ్య రకమైన సినిమాలు ఉంటున్నాయి. అవే సినిమాకి ఊపిరిగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం సినీ పరిశ్రమ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ నిర్మాతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని .. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కన్వే చేయడానికి పెట్టిన ఈ ప్రెస్ మీట్ కి హాజరైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ స్వాగతం. చాలామంది నిర్మాతలకు ఎటువంటి ఇబ్బందులు లేవు.. పూల పాన్పు పై పయనిస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. మీరు అనుకున్నదంతా ఏమీ లేదు. అందుకే ఇండస్ట్రీ సమస్యలు తీరే వరకూ నేను ఈ మాల తీయను. నిన్నటి నుంచి ఈ మాల ధరించాను. ఇండస్ట్రీలో అన్ని సమస్యలు పూర్తయ్యే వరకూ మాల తీయను " అంటూ నిర్మాత ఎస్ కే ఎన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
