Begin typing your search above and press return to search.

లవర్ ఉంటే చెప్పండి.. అలా మాత్రం చేయొద్దు: SKN రిక్వెస్ట్!

నిర్మాత ఎస్కేఎన్ గురించి అందరికీ తెలిసిందే. జర్నలిస్ట్‌ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌ లోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు.

By:  M Prashanth   |   3 Dec 2025 3:24 PM IST
లవర్ ఉంటే చెప్పండి.. అలా మాత్రం చేయొద్దు: SKN రిక్వెస్ట్!
X

నిర్మాత ఎస్కేఎన్ గురించి అందరికీ తెలిసిందే. జర్నలిస్ట్‌ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌ లోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా వర్క్ చేసిన ఆయన.. ఆ తర్వాత వివిధ సినిమాలకు కో ప్రొడ్యూసర్‌ గా వ్యవహరించారు ఎస్కేఎన్.

అనంతరం మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై రొమాన్స్, మంచి రోజులొచ్చాయి, 3 రోజెస్, బేబీ సినిమాలు రూపొందించారు. అందులో బేబీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం వివిధ సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో ఒకటైన 3 రోజెస్ సీజన్ 2ను మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

అయితే సినిమా ఈవెంట్లలో తన స్పీచులతో, కామెంట్స్ తోపాటు సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు ఎస్కేఎన్. తరచూ ఆయన కామెంట్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆయన హోస్ట్ చేసిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు.

ఎస్కేఎన్ తాను నిర్మిస్తున్న 3 రోజెస్ ప్రాజెక్టులో ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించిన ముగ్గురు భామలు ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపుతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ సమయంలో 'మీకు లవర్ ఉంటే… పెళ్లికి ముందే చెప్పేయండి' అని ఎస్కేఎన్ అన్నారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన క్రైమ్ లు జరిగిన విధానాలు ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు.

"లవర్ ఉంటే చెప్పండి.. అంతే గానీ శనగల కవర్‌ లో సైనైడ్ పెట్టడం, హనీమూన్‌ కు తీసుకెళ్లి కొండపై నుంచి తోసేయడం, డ్రంలో సిమెంట్ పోసి మూత వేయడం, కోసి ముక్కలు చేసి కుక్కర్‌ లో వండేయడం.. అలాంటివి పనులు అస్సుల చేయొద్దు.. మీరు కట్నం ఇవ్వొద్దు.. మాకు భరణం ఇవ్వమని అడగొద్దు" అని ఎస్కేఎన్ అన్నారు.

"ఆ తర్వాత కొరియన్ సిరీస్ లు చూడండి. కానీ మేము అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన ఇంట్లో పిల్లలకు ఎక్స్ ల పేర్లు పెట్టండి కానీ ఎక్స్ ల పిల్లలను ఇంట్లో పెంచకండి.. స్పేస్ కావాలంటారు.. ఇస్తే అటెన్షన్ ఇవ్వలేదు అంటారు.. అయితే స్పేస్ ఉన్న చోట అటెన్షన్ ఉండదు.. అటెన్షన్ ఉన్న చోట.. స్పేస్ ఉండదు" అంటూ చెప్పుకొచ్చారు ఎస్కేఎన్. అయితే ఆయన సజెషన్స్ మామూలుగా లేవని, ఫుల్ ఫన్నీ అని నెటిజన్లు చెబుతున్నారు.