మహేష్ ఫ్యాన్ కు సాయం చేసిన ఎస్కేఎన్
టాలీవుడ్ లో జర్నలిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు నిర్మాతగా ఎదిగారు ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్.
By: Sravani Lakshmi Srungarapu | 20 Nov 2025 1:25 PM ISTటాలీవుడ్ లో జర్నలిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు నిర్మాతగా ఎదిగారు ఎస్కేఎన్ అలియాస్ శ్రీనివాస్ కుమార్. ఎస్కేఎన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిర్మాతగా ఆయన పలు సక్సెస్‌ఫుల్ సినిమాలు తీశారు. పలు సందర్భాల్లో వేదికలపై ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు ఎన్నోసార్లు వైరల్ కూడా అయ్యాయి. నిర్మాతగా ఎంతో మందికి సాయం చేసిన ఎస్కేఎన్ పలు సందర్భాల్లో తన మంచి మనసును చాటుకున్నారు.
కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ..
కుడి చేత్తో చేసిన సాయాన్ని ఎడమ చేతికి కూడా తెలియకూడదనే మాటను నిజం చేస్తూ ఎంతో మందికి ఎన్నో సార్లు సాయం చేశారాయన. కష్టాల్లో ఉన్నామని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అన్ని విషయాలు కనుక్కుని మరీ హెల్ప్ చేస్తుంటారు. అలా ఎంతో మందికి సాయం చేసిన ఎస్కేఎన్ తాజాగా మరోసారి గొప్ప మనసుని చాటుకున్నారు.
మహేష్ ఫ్యాన్ కు సాయం చేసిన ఎస్కేఎన్
రీసెంట్ గా మహేష్ బాబు ఫ్యాన్ ఒకరు చనిపోయారు. అతనికి 10 ఏళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు ఉండటంతో వారి కుటుంబానికి ఏదైనా హెల్ప్ చేయాలని సోషల్ మీడియాలో ఓ అభిమాని పెట్టిన పోస్టుకు ఎస్కేఎన్ రియాక్ట్ అయ్యారు. ఓ అభిమానిగా ఇంకో అభిమాని ఎమోషన్ ను అర్థం చేసుకోగలనంటూ, ప్రస్తుతం ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, వాళ్ల పిల్లలకు అది దూరం కాకూడదని, తన వైపు నుంచి రూ.2 లక్షలు వాళ్ల చదువుల కోసం ఇస్తానని ఎక్స్ వేదికగా ప్రామిస్ చేశారు ఎస్కేఎన్.
ఇచ్చిన మాట ప్రకారమే ఎస్కేఎన్ ఆ ఫ్యామిలీని కలిసి రూ.2 లక్షల చెక్ అందించారు. ఎస్కేఎన్ చేసిన ఈ పనిని సోషల్ మీడియాలోని అందరూ ప్రశంసిస్తుండగా, ఎస్కేఎన్ ఆ ఫ్యామిలీని కలిసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా అభిమాని అయిన ఎస్కేఎన్, కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాకుండా కష్టాల్లో ఉన్న ఎవరికైనా హెల్ప్ చేస్తూ తన మంచి మనసును తెలియచేస్తున్నారు.
