ఘాటీ.. అనుష్కతో మాస్ యాక్షన్ డ్రామా: నిర్మాత రాజీవ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్‌లో ఫిమేల్ సూపర్ స్టార్‌తో మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలని ఆలోచన చాలాకాలంగా ఉందని నిర్మాత రాజీవ్ రెడ్డి చెప్పారు.
By: M Prashanth | 25 Aug 2025 8:30 PM ISTటాలీవుడ్‌లో ఫిమేల్ సూపర్ స్టార్‌తో మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలని ఆలోచన చాలాకాలంగా ఉందని నిర్మాత రాజీవ్ రెడ్డి చెప్పారు. కర్తవ్యం తర్వాత ఆ రేంజ్‌లో సినిమా రాలేదని, అలాంటి స్థాయి ప్రాజెక్ట్ కోసం అనుష్కనే సరైన ఛాయిస్ గా భావించామని తెలిపారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ ఆ ఆలోచనతోనే రూపుదిద్దుకుందని ఆయన వివరించారు.
నిర్మాత రాజీవ్ మాట్లాడుతూ.. “అరుకు, గాంజా బ్యాక్‌డ్రాప్‌లో ఒక కథ చేయాలనుకున్నాం. అది సినిమాలా చేయాలా లేదా వెబ్ సిరీస్ లా చేయాలా అని డిస్కషన్స్ జరిగాయి. కానీ అనుష్క గారిని ఈ ప్రాజెక్ట్‌లో అనుకున్న తర్వాత సినిమా రూపంలోనే చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. ఎలాంటి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ లేదు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్‌లో ఎక్కువగా షూట్ చేశాం. అక్కడి లోకల్ పీపుల్ ఎంతో సపోర్ట్ చేశారు” అని రాజీవ్ రెడ్డి అన్నారు. విక్రమ్ ప్రభు ఎంపిక గురించి మాట్లాడుతూ.. “అది క్రిష్ గారే నిర్ణయించారు. తమిళ్ వెర్షన్‌కీ ఇది పెద్ద ప్లస్ అవుతుంది. ఆయన అద్భుతంగా నటించారు” అని తెలిపారు.
అనుష్క పెర్ఫార్మెన్స్
“టీజర్, ట్రైలర్‌లో ఎంత ఇంటెన్సిటీ చూసారో సినిమాలో కూడా అంతే ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇది ఫుల్ యాక్షన్ సినిమా. క్రిష్ మార్క్ డ్రామా ఉంటుంది. అనుష్క గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒరిస్సాలో షూటింగ్ సమయంలో వేలాది మంది ఆమెను చూడటానికి వచ్చేవారు. రెండు మూడు సార్లు లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ స్థాయిలో అనుష్క గారికి దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఘాటీలో విజువల్స్ అవుట్‌స్టాండింగ్‌గా ఉంటాయి. ఆడియన్స్‌కి విజువల్ ట్రీట్‌గా మారుతుంది” అని చెప్పారు.
ఘాటీకి పార్ట్ 2 ఉంటుందా?
“ప్రస్తుతం ఆ ఆలోచన లేదు. కానీ ఆడియన్స్ పెద్ద హిట్ చేస్తే పార్ట్ 2 ఆలోచించవచ్చు. ఈ కథకు పార్ట్ 2 చేసే స్కోప్ ఉంది. క్రిష్ అనుష్క కాంబినేషన్‌లో వేదం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఘాటీని తీశాం. కచ్చితంగా ఆ రేంజ్‌కు రీచ్ అవుతుందనే నమ్మకం మాకుంది” అని నిర్మాత రాజీవ్ రెడ్డి అన్నారు.
మ్యూజిక్, టెక్నికల్ వర్క్
“సంగీత దర్శకుడు సాగర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అద్భుతంగా ఉంది. క్రిష్ గారు ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. మా సినిమాల్లో పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఘాటీ కూడా అదే స్థాయిలో వచ్చింది. మేము ఏదైతే అనుకున్నామో అది స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం” అని చెప్పారు.
భవిష్యత్ ప్రాజెక్ట్స్
“వరుణ్ తేజ్ గారితో చేస్తున్న సినిమా దాదాపు 80% పూర్తయింది. అది మంచి హారర్ కామెడీ ఎంటర్టైనర్. అలాగే అరేబియన్ కడలి సీజన్ 2 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. అమెజాన్ కోసం ఒక ఒరిజినల్ ఫిలిం కూడా చేస్తున్నాం. ఇంకొన్ని స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి. ఘాటీ రిలీజ్ అయిన తర్వాత వాటి అనౌన్స్‌మెంట్స్ వస్తాయి” అని నిర్మాత వివరించారు.
