Begin typing your search above and press return to search.

బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న ట్వీట్‌.. ఎవరిని టార్గెట్ చేశారో??

ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

By:  M Prashanth   |   16 Oct 2025 4:52 PM IST
బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న ట్వీట్‌.. ఎవరిని టార్గెట్ చేశారో??
X

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆయన.. తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సూటి మాటలతో.. ఘాటు వ్యాఖ్యలతో వైరల్ అవుతుంటారు. అంతే కాదు.. నెట్టింట కూడా ఏదో ఒక పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ గా మారుతుంటారు. కొత్త చర్చలను లేవనెత్తుతుంటారు. ఇప్పుడు వరకు చాలా సార్లు అలా జరిగింది.

ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. అది పీకుతా, ఇది పీకుతా అని చెప్పాల్సిన పనిలేదు.. మాటలు మన చేతిలో ఉన్నప్ప‌టికీ, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అంటూ రాసుకొచ్చారు. దీంతో బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్.. క్షణాల్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

దీంతో అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. బండ్ల గణేష్ ఎవరినో ఉద్దేశించి కావాలనే పోస్ట్ పెట్టారని అంటున్నారు. ఎవరో చేసిన కామెంట్లకు ఇప్పుడు బండ్ల గణేష్ పరోక్షంగా స్పందించారని అభిప్రాయపడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి పెట్టారోనని మాట్లాడుకుంటున్నారు.

అదే సమయంలో ఇటీవల టాలీవుడ్ లో జరిగిన పలు వివాదాలను ప్రస్తావిస్తున్నారు. అందుకే ఎవరో ఒకరిని టార్గెట్ చేసి పోస్ట్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు. అయితే బండ్ల గణేష్.. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై పోస్ట్ పెట్టడం ఇదేం తొలిసారి కాదు. ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. కానీ పోస్ట్ లో ఎవరు పేరును కూడా ప్రస్తావించలేదు.

కానీ బండ్ల గణేష్ లేటెస్ట్ స్టేట్ మెంట్ తో ఒక్కసారిగా చర్చలు వేడెక్కాయి. ఏదేమైనా బండ్ల గణేష్.. ఏదో విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఆయన పోస్ట్.. కామెంట్ నిజంగా ఎవరిని ఉద్దేశించి చేశారో.. లేదా సాధారణంగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై అనేది ఆయనకే తెలియాలి. మరేం జరిగిందో ఏంటో..

ఇక బండ్ల గణేష్ విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సుస్వాగతం మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చారు. కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారు. తొలిసారి వినోదం మూవీలో నటించిన ఆయన.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో యాక్ట్ చేశారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ తీసిన సినిమాల్లో ఎక్కువగా కనిపించారు. ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన ఆయన.. చివరగా టెంపర్ చిత్రాన్ని నిర్మించారు. యాక్టర్ గా చివరిసారి సన్నాఫ్ ఆఫ్ ఇండియాలో కనిపించారు. రీసెంట్ గా మళ్ళీ సినిమాలు చేస్తానని తెలిపారు.