10 సార్లు కాల్ చేస్తే పట్టించుకోలేదు.. మా వాదన ఎవరూ వినరు: నిర్మాత అహితేజ
అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా తన అప్ కమింగ్ మూవీ శశివదనే ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేయగా, హాట్ టాపిక్ గా మారాయి.
By: M Prashanth | 4 Oct 2025 5:34 PM ISTటాలీవుడ్ యువ నిర్మాత అహితేజ బెల్లంకొండ ఎప్పటికప్పుడు చిన్న సినిమాల విషయంలో ఉండే సమస్యలపై పోస్టులు పెడుతుంటారన్న విషయం తెలిసిందే. అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా తన అప్ కమింగ్ మూవీ శశివదనే ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేయగా, హాట్ టాపిక్ గా మారాయి.
"కొన్నేళ్లుగా మీ ట్వీట్లు చూస్తున్నా.. చిన్న సినిమాల గురించి ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. రెండు రోజుల క్రితం ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటే బాగుణ్ణు అన్నారు. ఎందుకలా? చిన్న సినిమాలు తీయడమంటే అంత కష్టమా?" అని విలేకరి అడగ్గా.. చాలా కష్టమని తెలిపారు నిర్మాత. అందుకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు.
"నా సినిమాలో యాక్షన్ పార్ట్, లవ్ స్టోరీ ఉంది. నేను ముందే బడ్జెట్ బట్టి యాక్షన్ పార్ట్ ను లాస్ట్ లో షూట్ ప్లాన్ చేద్దామని అనుకున్నాం. అప్పుడే ఇండస్ట్రీలో స్ట్రైక్ అయింది. 30 శాతం వేతనాలు హైక్ అన్నారు. మూడు కోట్లల్లోపు సినిమాలకు 10 శాతం హైక్ అన్నారు. సరే అందరినీ తీసుకెళ్లాం. షాట్ స్టార్ట్ చేశాం" అని తెలిపారు.
"అప్పుడు కార్మికులు 30 శాతం ఇస్తే గానీ రామన్నారు. అప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కు పది సార్లు కాల్ చేశా. షూటింగ్ ప్యాక్ చేసుకుని వచ్చేయమన్నారు. చేయకపోయినా పర్లేదన్నారు. నాకు కేవలం ట్రావెలింగ్ కు రూ.6-7 కోట్లు అవుతాయి. కానీ క్యాన్సిల్ చేసుకుని వచ్చేయమన్నారు. నాలుగు రోజుల డబ్బులు వస్తాయి" అని అన్నారు.
"ఎన్నిసార్లు కాల్ చేసినా ఛాంబర్ స్పందించలేదు. ఆ మధ్య మరో ఇష్యూలో కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బెంజ్ కారుల్లో వచ్చే వాళ్లు వారికి ప్రొడ్యూసర్లు. నేను కంఫర్ట్ లైఫ్ వదిలి.. జాబ్ వదిలి.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా నిర్మాతగా మారా. అందుకే పట్టించుకోరు. చివరకు హీరో గారి వల్ల ప్రాబ్లమ్ క్లియర్ చేసుకున్నా"
"అదే వాళ్లు స్పందించి ఉంటే సమస్య వేగంగా తీరేది. అసలేం జరుగుతుందో తెలియదు. మా లాంటి వాళ్ళ బాధ ఎవరూ వినరు. అయితే ఇప్పుడు మారిందని అనుకుంటున్నా. సోషల్ మీడియా వల్ల ఛేంజ్ వచ్చిందని అనుకుంటున్నా. చిన్న ప్రొడ్యూసర్లు ఎస్ కే ఎన్ సహా పలువురు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టారు" అని తెలిపారు.
"కనీసం వాళ్లేనా సపోర్ట్ చేయాలి. ప్యాషన్ ను తో జాబ్ ను వదిలి కమిట్మెంట్ తో ఇండస్ట్రీలోకి వస్తున్నాం. ఏదో సాధించాలని వస్తున్నాం. కేవలం టికెట్ రేట్లపై మీటింగ్స్ జరుగుతున్నాయి. టికెట్ రేట్స్ ఒకటే ఇష్యూ కాదని మా ఫీలింగ్. ఓ పెద్ద సినిమాకు లొకేషన్ ఒకటే కాస్ట్.. చిన్న సినిమాకు కూడా అదే కాస్ట్" అని తెలిపారు.
"చిన్న సినిమా విషయంలో కాస్త లొకేషన్ కాస్ట్ లు తగ్గించే నిబంధనలు తీసుకొస్తే బతుకుతారు. పబ్లిసిటీ కాస్ట్ అందరికీ ఒకటే. సేమ్ ఛార్జీలు తీసుకుంటారు కానీ అదెవరూ మాట్లాడటం లేదు. హీరో ఉన్నారు కాబట్టి వాళ్ల ఎంతైనా బడ్జెట్ పెడతారు. మాకేం కొత్త హీరోలు ఉంటారు. వాళ్లకు మాకు తేడా ఉండాలి" అని కోరారు.
"కానీ మా వాదన వినే ఛాన్స్ లేదు. అసోసియేషన్ ను ఏం అనడం లేదు. దాని రూల్స్ దానికి ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నవారు అందరూ చిన్న నిర్మాతలకు ఛాన్స్ ఇవ్వాలి. మా వెర్షన్ వినాలి" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ ఫుల్ వైరల్ గా మారాయి.
