Begin typing your search above and press return to search.

ఎపిక్ 'ప్రియసఖి' సాంగ్.. హైప్ మరింత పెంచేలా..

ఇక విజువల్స్ విషయానికి వస్తే.. లండన్ బ్యాక్‌ డ్రాప్‌ లో షూట్ చేసిన రొమాంటిక్ షాట్స్ ఎంతో కలర్‌ ఫుల్‌ గా కనిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   27 May 2026 3:21 PM IST
ఎపిక్ ప్రియసఖి సాంగ్.. హైప్ మరింత పెంచేలా..
X

యంగ్ క్యాస్టింగ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ ఫుల్ లవ్ స్టోరీ ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ పై రోజురోజుకు ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఇప్పటికే టైటిల్‌, గ్లింప్స్ తో యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఆ చిత్రం.. ఇప్పుడు ప్రియసఖి సాంగ్‌ తో మరింత హైప్ సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ బేబీ తర్వాత మరోసారి ఆనంద్-వైష్ణవి జోడీ నటిస్తుండటమే సినిమాకు మొదటి నుంచీ పెద్ద ప్లస్‌ గా మారింది.

ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మెలోడియస్ ట్రాక్ ఆ అంచనాలను పెంచింది. 'సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది' అంటూ ప్రారంభమైన సాంగ్ ఫీల్‌ గుడ్ వైబ్స్‌ తో సాగింది. ప్రేమలో కొత్తగా పడిన ఓ యువకుడి ఎమోషన్స్ ను బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. 'జీవితాన్ని మార్చేశావే బుజ్జి నెమలి.. స్వర్గం లోతు చూపించావే పూల కడలి' వంటి లైన్లు యువతకు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

లిరిక్స్‌ లోని అమాయకత్వం, ప్రేమలో ఉండే స్వీట్ ఫీలింగ్ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. సాంగ్‌ కు సురేశ్ బనిశెట్టి అందించిన లిరిక్స్ మెయిన్ అట్రాక్షన్ గా నిలవగా.. హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరాలు మరోసారి మ్యాజిక్ చేశాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖుషి తర్వాత మెలోడీ సాంగ్స్‌ సలో తనదైన మార్క్ చూపిస్తున్న హేషమ్.. ఈ పాటను కూడా రిపీట్ మోడ్‌ లో వినేలా కంపోజ్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే కేఎస్ హరిశంకర్ వాయిస్ మరింత ఎమోషన్ తీసుకొచ్చింది.

ఇక విజువల్స్ విషయానికి వస్తే.. లండన్ బ్యాక్‌ డ్రాప్‌ లో షూట్ చేసిన రొమాంటిక్ షాట్స్ ఎంతో కలర్‌ ఫుల్‌ గా కనిపిస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ మళ్లీ హైలైట్ అవుతుందని పాటతో క్లియర్ గా తెలుస్తోంది. బేబీలో ఎమోషనల్ బాండింగ్‌ తో ఆకట్టుకున్న ఆ జోడీ.. ఇప్పుడింకా ఫ్రెష్‌ గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు యూత్ ఎమోషన్స్‌ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. గ్లింప్స్, పాటలు చూస్తుంటే కాలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే క్లీన్ లవ్ స్టోరీగా మూవీ ఉండబోతుందని అనిపిస్తోంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఎమోషనల్ లవ్ స్టోరీస్‌ కు మంచి డిమాండ్ ఉందని చెప్పాలి.

కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్న రోజుల్లో.. మేకర్స్ కూడా మ్యూజిక్‌, ఎమోషన్స్‌ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అదే స్ట్రాటజీ ఎపిక్ టీమ్ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఇప్పుడు ప్రియసఖి సాంగ్ కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఆ చిత్రం జూలైలో విడుదల కానుండగా.. ప్రియసఖి సాంగ్‌ తో మరింత హైప్ పెరిగింది.