Begin typing your search above and press return to search.

ప‌బ్లిక్ వేదిక‌పై నిక్ త‌న భార్యపై కురిపించిన ప్రేమ‌ను చూసారా?

ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట మరోసారి సోషల్ మీడియాలో ఆద‌ర్శ జంట అని నిరూపించుకున్నారు.

By:  Sivaji Kontham   |   19 Feb 2026 11:30 PM IST
ప‌బ్లిక్ వేదిక‌పై నిక్ త‌న భార్యపై కురిపించిన ప్రేమ‌ను చూసారా?
X

ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంట మరోసారి సోషల్ మీడియాలో ఆద‌ర్శ జంట అని నిరూపించుకున్నారు. నిక్ జోనాస్ తన భార్యపై కురిపించిన ప్రేమాభిమానాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్లలో వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూస్తుంటే భార్యాభర్తల అనుబంధానికి వీరు ఒక ప్రతీకగా కనిపిస్తున్నారు. త‌మ లైఫ్ జ‌ర్నీలో ఎన్ని కుట్రలు జ‌రిగినా.. పుకార్లు వచ్చినా ఈ జంట తమ ప్రేమతో వాటన్నింటినీ పటాపంచలు చేస్తోంది.





కేవ‌లం ఈ జంట వ్య‌క్తిగ‌త జీవితం, ప్ర‌యివేట్ లైఫ్ లోనే కాదు.. ప‌బ్లిక్ వేదిక‌ల‌పై కూడా ఈ జంట న‌డుమ ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు హృద‌యాల‌ను గెలుచుకుంటాయి...ఈ జంట భార్యా భ‌ర్త‌ల అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలుస్తున్నారు. ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ ఒక‌రి సినిమాల‌కు ఒక‌రు ప్ర‌మోష‌న్లు చేసుకుంటూ, వృత్తిగ‌తంగాను మ‌ద్ధ‌తును ఇస్తూ ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.





ప్రియానిక్ ఆదర్శవంతమైన ప్రేమ కథకు నిలువెత్తు సాక్ష్యం `ది బ్ల‌ఫ్` ప్ర‌మోష‌న్‌లోని ఈ ఫోటోగ్రాఫ్స్. వేదిక‌పై అత‌డు పీసీ చేతిని వ‌దిలిపెట్ట‌లేదు. త‌న‌కు అన్నివిధాలా చేదోడు వాదోడుగా క‌నిపించాడు. `ది బ్లఫ్` సినిమాలో ప్రియాంక నటనను, నిర్మాతగా త‌న భార్య‌ పడ్డ కష్టాన్ని చూసి నిక్ గర్వంగా ఉందంటూ పబ్లిక్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ప్రియాంక సంప్రదాయాలను గౌరవిస్తూ నిక్ తన చేతికి మంగళసూత్ర బ్రేస్‌లెట్ ధరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిక్ వ్య‌వ‌హారం చూసిన అభిమానులు ఆయన కేవలం గ్రీన్ ఫ్లాగ్ మాత్రమే కాదు, ఏకంగా గ్రీన్ ఫారెస్ట్ (అత్యంత ఉత్తముడు) అంటూ పొగుడుతున్నారు.





ది బ్ల‌ఫ్ చిత్రంలో ప్రియాంక పాత్ర బ్లడీ మేరీ స్ఫూర్తితో నిక్ స్వయంగా కాక్టెయిల్ తయారు చేసి సినిమా ప్రమోషన్లలో భాగమయ్యారు. వేదిక‌ల‌పై దేశీ గర్ల్ ని పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని నిక్ గర్వంగా చెప్పుకోవడం వారి బంధం లో డెప్త్ ని తెలియజేస్తోంది. అలాగే భారతీయ సంప్రదాయాలను నిక్ ఎంతగా గౌరవిస్తారో ఆయన మంగళసూత్ర బ్రేస్‌లెట్ ధరించడం ద్వారా మరోసారి స్పష్టమైంది. ఆ ఇద్ద‌రూ ఒకరి సినిమాలకు ఒకరు మద్దతుగా నిలుస్తూ, వృత్తిపరంగా కూడా ఒకరి ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. సినిమాలో తాను వాడిన అసలైన ఆర్మర్ (కవచం) ధరించి ప్రియాంక ప్రీమియర్‌కు రావడం అందరినీ ఆకట్టుకుంది.

అలాగే సినిమా ప్రీమియర్ కోసం సిద్ధమవుతున్న ప్రియాంక చేతికి కూతురు మాల్తీ టాటూలు వేస్తున్న క్యూట్ ఫోటోలు ఇటీవ‌ల‌ వైరల్ అయ్యాయి. గ్లామర్ ప్రపంచంలో ఉన్నా, తన టీమ్ మధ్యలో కూతురితో గడిపే సమయాన్ని ప్రియాంక ఎంతగానో ఆస్వాధిస్తోంది.

`ది బ్లఫ్` సినిమాను ఇప్పటికే రెండుసార్లు చూసిన నిక్, ఇది ఒక అద్భుతమైన రైడ్ అని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు. నటిగానే కాకుండా ఒక కథకు ప్రాణం పోసే నిర్మాతగా ప్రియాంక పట్టుదలను నిక్ అభినందించారు. ఫిబ్రవరి 25నుంచి యాక్షన్ ప్యాక్డ్ మూవీ `ది బ్లఫ్` అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయనుంది.