'డబ్బులిచ్చి మరీ అలా..'.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ఓజీ మూవీతో మరికొద్ది రోజుల్లో సందడి చేయనున్నారు మాలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్.
By: M Prashanth | 17 Sept 2025 11:02 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ఓజీ మూవీతో మరికొద్ది రోజుల్లో సందడి చేయనున్నారు మాలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని మూవీ గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఓజీ చిత్రంతో సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అయితే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ చేసిన షాకింగ్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమెపై జరుగుతున్న ట్రోల్స్ పై రెస్పాండ్ అయ్యారు. తన యాక్టింగ్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ పై కొంతమంది చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై సీరియస్ గా రియాక్ట్ అయింది పవన్ హీరోయిన్.
సోషల్ మీడియాలో తనపై కావాలని ట్రోల్స్ చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రియాంక. తనకు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణమేదనని తెలిపారు. తనకు ఉన్న ఇమేజ్ కు దెబ్బతీయడమే లక్ష్యంగా అలా చేస్తున్నారని చెప్పిన ప్రియాంక.. అవన్నీ తనకు తెలుసని తెలిపింది. డబ్బులిచ్చి మరీ చేయిస్తున్నారని ఆరోపించింది.
కొంతమంది కావాలని డబ్బులిచ్చి మరీ తనపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ప్రియాంక చెప్పడంతో.. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమ్మడుపై ఎందుకు అనవసరంగా అలా చేస్తున్నారని అనేక మంది నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. డబ్బులిచ్చి మరి ఎవరలా చేస్తున్నారోనని మాట్లాడుకుంటున్నారు.
అయితే అదే సమయంలో మరో విషయం చక్కర్లు కొడుతోంది. తమిళ స్టార్స్ తో పని చేసే ఓ ప్రముఖ సంస్థతో కొంతకాలం క్రితం ప్రియాంక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ఇటీవల క్యాన్సిల్ చేసుకున్నారని సమాచారం. అందుకే ఆమెపై నెగిటివిటీ స్ట్రెడ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రియాంక కామెంట్స్ తర్వాత ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే ప్రియాంక చెప్పినట్లు.. ట్రోల్స్, నెగిటివిటీ వల్ల అవకాశాలు మాత్రం బాగా తగ్గాయి. లేకుంటే కచ్చితంగా వరుస ఛాన్సులు ఆమె సొంతమయ్యేవి. మంచి హిట్స్ కూడా దక్కేవనే చెప్పాలి.
