Begin typing your search above and press return to search.

OG హీరోయిన్.. వాటికి రెడీ కాదా..?

ఐతే ఓజీ హీరోయిన్ కెరీర్ ని అబ్జర్వ్ చేస్తే మన పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలను మాత్రమే చేస్తుంది.

By:  Ramesh Boddu   |   28 Sept 2025 10:44 AM IST
OG హీరోయిన్.. వాటికి రెడీ కాదా..?
X

హీరోయిన్స్ అందరు ఒకేళా ఉండాలని రూల్ ఏమి లేదు. ముఖ్యంగా సినిమాల ఎంపిక.. పాత్రల విధానం ఎవరికి వారు ఇష్టంగా చేస్తుంటారు. అవకాశం వస్తే చాలు ఎలాంటి రోల్స్ చేయడానికైనా రెడీ అనే వాళ్లు ఉంటారు. తనకు నచ్చిన రోల్ తప్ప మరే ఛాన్స్ అది స్టార్ సినిమా ఐనా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా చేయకూడదని ఫిక్స్ అయ్యే వాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో కొందరు హీరోయిన్స్ కేవలం తమ నటనతోనే ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తారు. అలాంటి వారిలో ప్రియాంక మోహన్ ఒకరు.

నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో..

ఈ చెన్నై చిన్నది తమిళ్ లో సినిమాలు చేస్తూ నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఓకే అనిపించుకోగా నెక్స్ట్ శర్వానంద్ తో శ్రీకారం చేసింది. అది నిరాశపరచింది. ఐతే ఆఫ్టర్ గ్యాప్ నానితోనే సరిపోదా శనివారం సినిమా చేసింది ప్రియాంక. ఇక రీసెంట్ గా ఓజీలో కన్మణి రోల్ లో ఇంప్రెస్ చేసింది. లెంగ్త్ చాలా తక్కువ ఉన్నా కూడా తన రోల్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంది అమ్మడు.

ఐతే ఓజీ హీరోయిన్ కెరీర్ ని అబ్జర్వ్ చేస్తే మన పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలను మాత్రమే చేస్తుంది. పాత్రల ఎంపికలో ప్రియాంక చాలా సెలెక్టెడ్ గా ఉంటుంది. దానికి రీజన్ అంటూ ఏమి లేదు. తనకు ఇలాంటి పాత్రలే ఇష్టం.. ఇలాంటి రోల్స్ మాత్రమే చేస్తా అనేలా ఒక స్ట్రిక్ట్ కండీషన్స్ పెట్టుకుంది. గ్లామర్ షోకి అమ్మడు ఆమడం దూరంలో ఉంటుంది. కొందరు సినిమాల్లో గ్లామర్ షో చేయరు ఫోటో షూట్స్ తో సరిపెడతారు. కానీ ప్రియాంక అలా ఫోటో షూట్స్ లో కూడా స్కిన్ షో చేయడానికి ఇష్టపడదు.

సాయి పల్లవి తర్వాత ప్రియాంక..

సాయి పల్లవి తర్వాత వితౌట్ గ్లామర్ రోల్స్ చేస్తూ వస్తుంది ప్రియాంక. ఐతే ఆమె అంత క్రేజ్ తెచ్చుకోలేదు కానీ ప్రియాంకాకు కూడా తెలుగు, తమిళ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ఓజీ చూశాక ఆమె మీద కూడా తెలుగు ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మరి ప్రియాంక ఎప్పుడు ఇలానే ఉంటుందా లేదా కెరీర్ రిస్క్ లో ఉందని గ్లామర్ రోల్స్ కి టర్న్ అవుతుందా అన్నది చూడాలి. పవర్ స్టార్ తో జత కట్టిన తర్వాత అమ్మడి కెరీర్ స్పీడ్ అందుకోకపోతే ఎలా.. ఆల్రెడీ తెలుగులోనే రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని టాక్. తమిళ్ లో కూడా ప్రియాంక తన ఫాం కొనసాగిస్తుంది.