Begin typing your search above and press return to search.

రెడ్ ఫ్రాక్ లో ప్రియాంక మోహన్ అందాలు!

ప్రముఖ హీరోయిన్ అందాల తార ప్రియాంక మోహన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   30 March 2026 10:38 AM IST
రెడ్ ఫ్రాక్ లో ప్రియాంక మోహన్ అందాలు!
X

ప్రముఖ హీరోయిన్ అందాల తార ప్రియాంక మోహన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనదైన నటనతో అభిమానులను సమ్మోహితులను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. 1994 నవంబర్ 20న కర్ణాటక బెంగళూరులో జన్మించిన ప్రియాంక అరుణ్ మోహన్ మూడబిద్రిలో అల్వాస్ పీయూ కళాశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయంలో బయోలాజికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం చెన్నైలోనే నివసిస్తున్నారు.




చదువుకునే సమయంలోనే 2019లో ఓంద్ కథే హెల్లా అనే కన్నడ చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియాంక మోహన్.. 2019లో వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. మొదటి సినిమాతోనే అమాయకపు మోముతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ప్రియాంక మోహన్.. 2024లో సరిపోదా శనివారం చిత్రంతో పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత డాక్టర్, డాన్ వంటి తమిళ చిత్రాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక మోహన్.




ఇకపోతే గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాలో డాక్టర్ కన్మణి పాత్రతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పటినుంచి పలు భాషా చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది . అందులో భాగంగానే ఒకటి కొరియన్ ,తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతున్న చిత్రంలో భాగమైన ప్రియాంక మోహన్.. మరో తమిళ్ చిత్రం తోపాటు మరో కన్నడ చిత్రంలో కూడా అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లతో బిజీగా మారిపోయింది ప్రియాంక మోహన్.

ఒకవైపు తన వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ప్రియాంక మోహన్ ఇటు అభిమానులను ఆకట్టుకోవడానికి ఇంస్టాగ్రామ్ వేదికగా రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిస్తూ ఫోటోలను పంచుకుంటుంది. అలా ఈ క్రమంలోనే తాజాగా మరో సారి రెడ్ మిర్చిలా ఘాటు అందాలను ప్రదర్శిస్తూ రెడ్ అవుట్ ఫిట్ తో మెస్మరైజ్ చేసింది ప్రియాంక మోహన్. మత్తెక్కించే చూపులతో అభిమానులను ఆకట్టుకునేలా ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు సైతం ఫిదా అవుతూ అందాల సోయగం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రియాంక మోహన్ సినిమాలలో నటించడమే కాకుండా అందులో ఉత్తమ నటన కనబరిచి అవార్డులు కూడా సొంతం చేసుకుంది.బిఅందులో భాగంగానే 2019లో నాని గ్యాంగ్ లీడర్ చిత్రానికి గాను ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలకు నామినేట్ కాగా, డాక్టర్ చిత్రానికి 2022 కు గాను ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో తమిళ్ నుంచి అవార్డును సొంతం చేసుకుంది. మొత్తానికి అయితే ప్రియాంక మోహన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఇలా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత చేరువ అవుతుంది ఈ ముద్దుగుమ్మ.