OG బ్యూటీకి తప్పని AI తిప్పలు.. ఆ ఫేక్ ఫొటోలపై కౌంటర్!
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో 'ఓజీ' లాంటి బిగ్ హిట్‌ను అందుకుని, కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటున్న నటి ప్రియాంక అరుళ్ మోహన్.. ఊహించని షాక్‌ను ఎదుర్కొంది.
By: M Prashanth | 11 Oct 2025 1:04 PM ISTటాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో 'ఓజీ' లాంటి బిగ్ హిట్‌ను అందుకుని, కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటున్న నటి ప్రియాంక అరుళ్ మోహన్.. ఊహించని షాక్‌ను ఎదుర్కొంది. ఈ చెన్నై బ్యూటీపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫొటోలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే అవి AI డీప్ ఫేక్ ఫొటోలు అని ఆమె క్లారిటీ ఇచ్చింది.
సాధారణంగా ఫేక్ ఫొటోలు రావడం కొత్త కాదు. కానీ, ఇప్పుడు డీప్‌ఫేక్ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి, ఎవరిని గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా అసభ్యకరమైన ఫొటోలు సృష్టించడం ప్రమాదకరంగా మారుతోంది. 'ఓజీ' విజయంతో ప్రియాంక మోహన్‌కు తెలుగులో క్రేజ్, అవకాశాలు పెరుగుతున్న సమయంలోనే, ఆమెను టార్గెట్ చేస్తూ ఇలాంటి ఫేక్ కంటెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. మొదట్లో నిజమైనవిగా భావించిన కొందరు విమర్శలు చేయగా, ఈ విషయం నటి దృష్టికి వెళ్లడంతో ఆమె వెంటనే స్పందించింది.
ప్రియాంక రియాక్షన్
ఈ వ్యవహారంపై ప్రియాంక మోహన్ తన ఎక్స్ (X) అకౌంట్‌లో క్లారిటీ ఇచ్చింది. " తనను ఏఐ టెక్నాలజీతో తప్పుగా చూపించేలా ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దయచేసి వాటిని షేర్ చేయడం ఆపండి" అని ఆమె రిక్వెస్ట్ చేసింది. ఆమె ఇంతటితో ఆగకుండా, ఏఐని చెత్త పనుల కోసం కాకుండా, మంచి మార్గాల్లో వాడుకోవాలని, ఇతరులను బాధ పెట్టే విధంగా వినియోగించడం తప్పు అని ఘాటుగా కామెంట్ చేసింది. ఈ విషయంలో ఆమె చూపించిన ధైర్యం, సెలబ్రిటీల ప్రైవసీపై కొత్త చర్చకు తెరతీసింది.
ప్రియాంక స్పందనపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు తెలిపారు. అలా క్రియేట్ చేసే వారిపై ఘాటుగా స్పందించారు. ప్రైవసీ ఉండదా? బాధ్యత లేదా? అంటూ సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఫేక్ ఫొటోలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మహిళా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టించే ట్రెండ్ ఎంత ప్రమాదకరంగా మారిందో మరోసారి సూచించింది.
ముంచుకొస్తున్న AI విలన్
ఈ సంఘటన కేవలం ప్రియాంక మోహన్‌కు మాత్రమే కాదు, ప్రతీ ఒక్క పబ్లిక్ ఫిగర్‌కు ఒక హెచ్చరిక. ఏఐ టెక్నాలజీ అనేది రెండు అంచులు ఉన్న కత్తి లాంటిది. దాన్ని ఎలా వాడాలి అనేది మన నైతిక విలువలకు సంబంధించినది. ఈ వివాదంపై చట్టాలు మరింత కఠినంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
