అన్నిసార్లు అలాంటి ఛాన్స్ అంటే ఎలా..?
ఓజీ తో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్. తెలుగులో సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ ఆ సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ సైలెంట్ అవుతుంది ఈ అమ్మడు.
By: Ramesh Boddu | 26 Nov 2025 11:01 AM ISTఓజీ తో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్. తెలుగులో సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ ఆ సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ సైలెంట్ అవుతుంది ఈ అమ్మడు. నాని గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన తర్వాత వెంటనే శర్వానంద్ తో శ్రీకారం చేసింది. ఆ తర్వాత మళ్లీ నాని సరిపోదా శనివారం తోనే రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పవర్ స్టార్ తో ఓజీ ఛాన్స్ అందుకుంది. ఓజీ తర్వాత అమ్మడి కెరీర్ దూకుడుగా ఉంటుంది అనుకుంటే అది జరగట్లేదు.
లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ లాంటివి..
అసలైతే నాని సుజీత్ కాంబో సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి కానీ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ఐతే ప్రియాంక మోహన్ సినిమా చేయాలంటే కొన్ని కండీషన్స్ పెడుతుందట. పాత్ర ప్రాధాన్యత ఉంటేనే చేస్తా అంటుందట. అంతేకాదు గ్లామర్ షోతో పాటు లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ లాంటివి ఉంటే వెంటనే నో చెప్పేస్తుందట. ట్రడిషనల్ రోల్స్ లోనే అది కూడా కథ నచ్చితేనే చేస్తుందట అమ్మడు.
ఐతే అన్నిసార్లు అలాంటి అవకాశాలు అంటే వస్తాయా లేదా అన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతిసారి ఒకే తరహా పాత్రలు చేస్తుంటే ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టేస్తుంది. అలా కాకుండా లిమిటెడ్ రోల్స్ తోనే సరిపెట్టేస్తా అంటే కుదరని పని. ప్రియాంక మోహన్ గ్లామర్ గా కనిపించకపోయినా అది ఆమె ఇష్టం కానీ కొన్నిసార్లు తన పొటెన్షియల్ చూపించే రోల్స్ చేయక తప్పదు. లేకపోతే ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది.
గ్లామర్ తో పనిలేకుండా కంటెంట్ ఉన్న..
గ్లామర్ తో పనిలేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రియాంక మోహన్ కూడా కెరీర్ ముందుకు సాగించాలి అంతేకానీ వచ్చిన ప్రాజెక్ట్ కి అది ఇది అని చెప్పి వదిలేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రియాంక మోహన్ కి తెలుగులో క్లాస్ ఇమేజ్ ఉంది. సో కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్ లు చేయడం మొదలు పెడితే మాత్రం ఇక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుంది.
అసలైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తర్వాత ఆఫర్లు క్యూ కడతాయి. కానీ వచ్చిన ఆఫర్స్ ని ఏదో ఒక విధంగా కాదని మళ్లీ ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తే మాత్రం కెరీర్ రిస్క్ లో పడినట్టే అవుతుంది. సో ఈ హీరోయిన్ తన ఆఫర్ల మీద మరోసారి ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఓజీ తో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రియాంక నెక్స్ట్ తమిళ్ లో 3 సినిమాల్లో నటిస్తుంది.
