Begin typing your search above and press return to search.

'ఓజీ' హిట్ తో అక్క‌డ ఎంట్రీ!

మ‌రి అప్పుడు స‌రైన స‌మ‌యంగా భావించ‌లేదా? ప‌రిశ్ర‌మ చిన్న‌ద‌ని లైట్ తీసుకుందా? అన్న‌ది తెలియ‌దు గానీ తాజాగా మాలీవుడ్ సినిమాల‌కు రెడీ అయిట‌న్లు వినిపిస్తోంది.

By:  Srikanth Kontham   |   2 Oct 2025 1:00 PM IST
ఓజీ హిట్ తో అక్క‌డ ఎంట్రీ!
X

మాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహ‌న్ గురించి ప‌రిచ‌యం అస‌వ‌రం లేదు. 'శ్రీకారం'తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన అమ్మ‌డు అటుపై `స‌రిపోదా శ‌నివారం`తో తొలి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ వెంట‌నే 'ఓజీ'లోనూ ఛాన్స్ అందుకుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా మంచి హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ క్రేజీ హిట్ సొంత భాష‌లో లాంచ్ అవుతుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్రియాంక కేర‌ళ బ్యూటీ అయినా తొలుత క‌న్న‌డ‌ ప‌రిశ్ర‌మ‌లో లాంచ్ అయింది. అటుపై తెలుగు, త‌మిళ్ సినిమాలు చేసింది గానీ ఇంత వ‌ర‌కూ మాలీవుడ్ లో మాత్రం లాంచ్ అవ్వ‌లేదు.

అత‌డితో ఛాన్సుల కోసం:

మ‌రి అప్పుడు స‌రైన స‌మ‌యంగా భావించ‌లేదా? ప‌రిశ్ర‌మ చిన్న‌ద‌ని లైట్ తీసుకుందా? అన్న‌ది తెలియ‌దు గానీ తాజాగా మాలీవుడ్ సినిమాల‌కు రెడీ అయిట‌న్లు వినిపిస్తోంది. మాలీవుడ్ స్టార్ టివినో థామ‌స్ హీరోగా న‌టించ‌నున్న ఓ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ అందుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగు, త‌మిళ సినిమాల‌తో ముందే లాంచ్ అయిన నేప‌థ్యంలో సొంత భాష‌లో డెబ్యూ.. స్టార్ హీరోతో ఛాన్స్ ఈ జీగా మారింది. టివినో థామ‌స్ మాలీవుడ్ లో బిజీ హీరో. ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌డితో ఛాన్సుల కోసం హీరోయిన్లు ఎంతో మంది క్యూలో ఉన్నారు.

ఆల‌స్యంగా సొంత భాష‌లో:

వాళ్ల‌ను కాద‌ని తాజా చిత్రంలో ప్రియాంక మోహ‌న్ కు హీరోయిన్ ఛాన్స్ రావ‌డం విశేషం. మ‌రి ఇదంతా ప‌వ‌న్ క్రేజ్ తోనేనా? అంటే అవున‌నే అనాలి. టాలీవుడ్ లో నాలుగేళ్ల క్రిత‌మే ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పుడు మాలీవుడ్ అవ‌కాశాలివ్వ‌డానికి ముందుకు రాలేదు. ప‌ర‌భాష‌లు ఆమెవైపు చూసాయి త‌ప్ప సొంత ప‌రిశ్ర‌మ ఖాత‌రు చేయ‌లేదు.

ఈ నేప‌థ్యంలో త‌మిళ్, తెలుగు సినిమాల స‌క్సస్ తోనే సొంత ప‌రిశ్ర‌మ‌లో లాంచ్ అవ్వ‌డం ఇంట్రెస్టింగ్.

ప్రియాంక మ‌న‌సులో ఉద్దేశం?

మ‌రి ఈ అవ‌కాశం ప‌ట్ల ప్రియాంక మ‌న‌సులో ఉద్దేశం ఏంటో? సాధార‌ణంగా త‌మిళ‌, తెలుగు సినిమాల‌తో బిజీగా ఉంటే మాలీవుడ్ కి వెళ్ల‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌రు. కానీ ప్రియాంక మన‌సులో మాత్రం అలాంటి బేధాలేవి లేవ‌ని తెలుస్తోంది. ఎప్పుడు ఏ భాష‌లో ఛాన్స్ వ‌చ్చినా తాను న‌టించ‌డానికి సిదంగా ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. మాలీవుడ్ డెబ్యూ గ‌నుక స‌క్సెస్ అయితే సొంత భాష‌లోనూ అమ్మ‌డు బిజీ అవ్వ‌డం ఖాయం. ప్ర‌స్తుతం త‌మిళ్ లో `క‌విన్` అనే చిత్రంలో న‌టిస్తోంది.