Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క రోల్.. ప్రియాంక కెరీర్‌ ను రీసెట్ చేస్తుందా?

టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక మోహన్.. గ్యాంగ్ లీడర్, డాక్టర్, డాన్, కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  M Prashanth   |   8 Sept 2026 1:00 AM IST
ఒకే ఒక్క రోల్.. ప్రియాంక కెరీర్‌ ను రీసెట్ చేస్తుందా?
X

హీరోయిన్ కెరీర్‌ లో కొన్ని సినిమాలు కేవలం హిట్స్‌ గా మిగిలిపోతాయి.. మరికొన్ని మాత్రం కెరీర్ మొత్తాన్నే మార్చేస్తాయి. ఇప్పుడు యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్‌ కు అలాంటి సినిమా అవసరమనే చర్చ జరుగుతోంది. వరుసగా పెద్ద హీరోల చిత్రాల్లో కనిపించిన తర్వాత.. ప్రస్తుతం ఆమె చేస్తున్న ప్రాజెక్టుల్లో పాత్రకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఆసక్తిని పెంచుతోంది. రాబోయే సినిమాల్లో ఏదైనా ఒక్క క్యారెక్టర్ క్లిక్ అయితే.. ప్రియాంక కెరీర్ రీసెట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక మోహన్.. గ్యాంగ్ లీడర్, డాక్టర్, డాన్, కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస అవకాశాలతో ఒకానొక టైమ్ లో టాలీవుడ్, కోలీవుడ్‌ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. పవన్ కల్యాణ్ నటించిన ఓజీలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆమె నుంచి వచ్చే మూవీలపై అందరి ఫోకస్ పడింది.

అయితే ఇప్పుడు ప్రియాంక ఎంచుకుంటున్న ప్రాజెక్టులు మాత్రం ఒకేలా ఉండటం లేదు. విభిన్న కథలు, కొత్త కాంబినేషన్లు, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న రోల్స్ వైపు ఆమె అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రియాంక మోహన్ చేతిలో కవిన్‌ తో ఓ సినిమా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో మంజనాత్తి ఉన్నాయి. వీటితో పాటు శింబు నటిస్తున్న అరసన్ లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆ సినిమాల్లో ఏదైనా స్ట్రాంగ్ రోల్ దక్కితే.. ఆమె కెరీర్‌ కు కొత్త ఊపు రావచ్చు. ముఖ్యంగా మారి సెల్వరాజ్ సినిమాల్లో కథ, పాత్రలకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే మంజనాత్తి ప్రియాంకకు హీరోయిన్ గా కొత్త యాంగిల్ ను చూపించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అలాగే అరసన్ కూడా ఆమెకు మరో కీలక అవకాశం కావచ్చు. శింబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.

ఇందులో ప్రియాంక రోల్ ఎలా ఉంటుంది? ఆమెకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ప్రియాంకను ఎక్కువగా గ్లామర్, కమర్షియల్ హీరోయిన్‌ గా చూసిన ప్రేక్షకులకు.. ఇకపై ఆమె యాక్టింగ్ లో మరో యాంగిల్ కనిపించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆమె కెరీర్‌ కు అది పెద్ద ప్లస్ అవుతుంది. హీరోయిన్ కెరీర్‌లో ఒక దశలో వేగం తగ్గడం సహజమే. కానీ ఆ దశ నుంచి బయటపడేందుకు సరైన కథ, సరైన పాత్ర దొరకడం చాలా ముఖ్యం. ప్రియాంక విషయంలోనూ ఇప్పుడు అదే కీలకం!

ఒక్క మంచి సినిమా.. ఒక్క గుర్తుండిపోయే పాత్ర.. ఇవి రెండూ కలిసి వస్తే ప్రియాంక కెరీర్ మళ్లీ స్పీడ్ అందుకోవచ్చు. స్టార్ హీరోతో సినిమా చేయడం కంటే.. ప్రేక్షకులు తన పాత్ర గురించి మాట్లాడుకునేలా చేయగలిగితే ఆమెకు మరోసారి టాప్ లీగ్‌ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రియాంకకు అసలు పరీక్ష సినిమాల కౌంట్ లో లేదు. ఎంతటి స్ట్రాంగ్ రోల్ లో కనిపిస్తారన్నదే కీలకం. రాబోయే సినిమాల్లో ఆమె సెలెక్ట్ చేసుకున్న రోల్స్ క్లిక్ అయితే.. కెరీర్ గ్రాఫ్ మారే అవకాశం లేకపోలేదు.