అమ్మడికి 'ఓజీ' ఉపయోగపడటం లేదా?
ఒక్క విజయం ఎన్నో అవకాశాలను తెచ్చి పెడుతుంది. అందులోనూ స్టార్ హీరోతో కలిసి హిట్ అందుకుంటే? ఆ కిక్ వెరే లెవల్లో ఉంటుంది.
By: Srikanth Kontham | 28 Nov 2025 9:00 PM ISTఒక్క విజయం ఎన్నో అవకాశాలను తెచ్చి పెడుతుంది. అందులోనూ స్టార్ హీరోతో కలిసి హిట్ అందుకుంటే? ఆ కిక్ వెరే లెవల్లో ఉంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన `ఓజీ` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 300 కోట్ల వసూళ్లు సాధించిందని వికీ లెక్కలు ఆధారంగా తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటించింది. మరి ఈ బ్యూటీ `ఓజీ` రిలీజ్ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్ కు సైన్ చేసిందా? అలాంటిందే కంనిపించడం లేదు. `ఓజీ` రిలీజ్ అయి ఇప్పటికీ రెండు నెలలవుతుంది. కానీ ప్రియాంక ఎలాండి హడావుడి లేకుండా చడీ చప్పుడు లేకుండానే ఉంది.
మాతృభాష కన్నడలో మళ్లీ ఓ సినిమా చేస్తుందనే ప్రచారం తప్ప! తెలుగులో కొత్త సినిమాల సంగతి మాత్రం బయటకు రాలేదు. `ఓజీ` లాంటి హిట్ తర్వాత దర్శక, నిర్మాతలు నటిని తమ సినిమాల్లో బుక్ చేసుకోవడానికి పోటీ పడాలి. కానీ ఆ సన్నివేశం ఎక్కడా కనిపించడం లేదు. ప్రియాంక మోహన్ కి ఇలాంటి ఫేజ్ ని ఫేస్ చేయడం కొత్తేం కాదు. `సరిపోదా శనివారం` రిలీజ్ అయిన సందర్బంలోనూ ఇదే పరిస్థితి. ఆ సినిమాలో అమ్మడు నానికి హీరోగా నటించింది. ఆ సినిమా కమర్శియల్ గా మంచి విజయం సాధించింది. కానీ ఆ రిలీజ్ తర్వాత కొత్త సినిమాకు సైన్ చేయడానికి చాలా సమయం పట్టింది.
అదే `ఓజీ` . మధ్యలో తమిళ ప్రేక్షకుల్ని ఓ రెండు సినిమాలతో పలకరించింది. కానీ అవేవి పెద్దగా ఆడలేదు. మరి `ఓజీ` ఇచ్చిన సక్సెస్ రెండు నెలలతో సరిపెడుతుందా? ఇంకా కొనసాగిస్తుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం
కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా `666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్` అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ని ఎంపిక చేసారు. సౌత్ నుంచే కొంత మంది భామలను పరిశీలించిన అనంతరం ప్రియాంకను ఫైనల్ చేసారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ కన్నడలో నటిస్తున్న చిత్రమిది.
అలాగే తమిళ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. కవిన్ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో అతడికి జోడీగా నటిస్తోంది. `మేడ్ ఇన్ కేరళ` టైటిల్ తో తెరకెక్కుతోన్న మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. కవిన్ తో సినిమా ప్రారంభమై నెలలు గడుస్తున్నా? అనివార్య కారణలతో డిలే అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.
