పిక్‌టాక్ : చీర కట్టులో ప్రియాంక అందం చూశారా?
ఆంధ్రప్రదేశ్ అనంతపురం అమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్ తెలుగులో 'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది.
By: Ramesh Palla | 2 Aug 2025 8:00 PM ISTఆంధ్రప్రదేశ్ అనంతపురం అమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్ తెలుగులో 'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. కమర్షియల్‌గా సినిమా పెద్దగా చేయక పోయినా విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌కి మంచి పేరును తెచ్చి పెట్టాయి అనడంలో సందేహం లేదు. ప్రియాంక పక్కన జవాల్కర్ అని ఉండటంతో చాలా మంది ఈ అమ్మడు ముంబై ముద్దుగుమ్మ లేదా నార్త్ ఇండియా నుంచి దిగుమతి అయిన ముద్దుగుమ్మ అని అనుకుంటున్నారు. తెలుగు అమ్మాయి అనే విషయం కాస్త ఆలస్యంగా చాలా మందికి తెలిసింది. ప్రియాంక జవాల్కర్ తెలుగు అమ్మాయి అయినా లక్కీగా పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.
ప్రియాంక జవాల్కర్ అందాల ఫోటో షూట్
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియాంక జవాల్కర్ మరిన్ని సినిమాలు చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రానప్పటికీ సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ఆరబోత చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ప్రియాంక జవాల్కర్ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటో షూట్స్‌ను షేర్ చేయడం ద్వారా తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచుతుంది. అందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు చీర కట్టు అందాలను ప్రియాకం ఈసారి షేర్ చేసింది.
ప్రియాంక చీర కట్టు ఫోటోలు వైరల్
సాధారణంగానే చీర కట్టులో ప్రియాంక చాలా అందంగా ఉంటుంది. ఈ ఫోటోల్లో సైడ్ యాంగిల్ ద్వారా నడుము అందం చూపించడం ద్వారా మరింత అందంగా ప్రియాంక జవాల్కర్ కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో నడుము అందం చూపిస్తూ ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతటి అందాల ముద్దుగుమ్మకు తెలుగు అమ్మాయి అనే సాకు చెప్పి ఆఫర్లు ఇవ్వడం లేదు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు చూసిన తర్వాత అయినా ఈమెకు ఆఫర్లు ఇస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా ఆఫర్ల కోసం ఎదురు చూపులు
సన్నని నడుము అందం చూపిస్తూ హొయలు పోతున్న ప్రియాంక జవాల్కర్ తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ప్రయత్నాలు చేయాలని తద్వారా మంచి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయంను సినీ వర్గాల వారు, ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో తప్ప ఇతర భాషల నుంచి ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు. అక్కడ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా సాధిస్తుందేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రియాంక జవాల్కర్ అందమైన రూపం ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా ఆఫర్లు తెచ్చి పెడుతుందని కొందరు అంటున్నారు.
ఈమె చేసిన తిమ్మరుసు, ఎస్‌ఆర్ కళ్యాణ మండపం సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఈమెకు లక్ కలిసి రాలేదు. చిన్న పాత్రల్లో, చిన్న సినిమాల్లోనూ ఈమె నటించి తన ప్రతిభను చూపించే ప్రయత్నాలు చేస్తుంది. ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
