Begin typing your search above and press return to search.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్లానింగ్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వృత్తిగ‌త‌- వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో మిసెస్ ప‌ర్పెక్ట్. ప్రస్తుతం పీసీ చేతిలో హాలీవుడ్ -టాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

By:  Srikanth Kontham   |   24 April 2026 4:00 AM IST
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్లానింగ్!
X

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వృత్తిగ‌త‌- వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో మిసెస్ ప‌ర్పెక్ట్. ప్రస్తుతం పీసీ చేతిలో హాలీవుడ్ -టాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఓవైపు వెస్ట్రన్ మీడియాలో టాప్ పొజిషన్‌లో ఉంటూనే మరోవైపు భారతీయ చిత్రాల‌పైనా దృష్టి పెట్టి ప‌ని చేస్తోంది. ఈ క్రమంలో పీసీ ప్లానింగ్ - టైమ్ మేనేజ్‌మెంట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ `సిటాడెల్` రెండో సీజన్ షూటింగ్‌లో ప్రియాంక బిజీగా ఉంది. యాక్షన్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్ కోసం అమ్మ‌డు ఎంతో శ్రమిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఇలాంటి భారీ ప్రాజెక్టును హ్యాండిల్ చేస్తూనే టాలీవుడ్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రాజ‌మౌళి రూపొందిస్తోన్న గ్లోబ‌ల్ మూవీ `వారణాసి` కోసం కూడా పీసీ సమయాన్ని కేటాయిస్తోంది. రెండు భిన్నమైన సినీ పరిశ్రమలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ల‌డం అంత సుల‌భం కాదు. ఎంతో ప్లానింగ్ ఉంటే త‌ప్ప సాధ్యం కాదు. అలాగే ప్రియాంక చోప్రా కేవలం న‌ట‌న‌కే పరిమితం కాకుండా కుటుంబానికి కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తారు. భర్త నిక్ జోనాస్ , కుమార్తె మాల్టీ మేరీతో గడిపే ప్రతి క్షణాన్ని ఆమె ఎంతో విలువైనదిగా భావిస్తుంది.

షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా? కుమార్తె ఎదుగుదలలో ఏలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా ఎంతో జాగ్ర‌త్త‌గాచూఏసుకుంటుంది. షూటింగ్ స్పాట్స్‌కు కూడా అప్పుడప్పుడు మాల్టీని తీసుకెళ్లుంది. ఒక తల్లిగా తన బాధ్యతలను సక్రమంగా వంద శాతం నెర‌వ‌ర్తిస్తుంది. అంతర్జాతీయ ఈవెంట్స్, రెడ్ కార్పెట్ అప్పీరెన్స్ , బ్రాండ్ ప్రమోషన్ల కోసం ప్రియాంక ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయినా నిక్ జోనాస్‌తో ఆమెకు ఉన్న అవగాహన ,పర్ఫెక్ట్ టైమ్ మేనేజ్‌మెంట్ వల్ల వారి మధ్య ఎటువంటి ఇబ్బందులు రావడం లేదు.

నిక్ మ్యూజిక్ టూర్స్ , ప్రియాంక షూటింగ్స్ మధ్య వారు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ పవర్ కపుల్ అనిపిం చుకుంటున్నారు. ఇంత బిజీలోనూ పీసీ ఫ్యామిలీ వెకేషన్ల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం విశేషం.

`వారణాసి` విషయానికి వస్తే ఈ సినిమాపై భారతీయ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో ప్రియాంక పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోంది. గ్లోబల్ లెవల్ గుర్తింపు ఉన్న ప్రియాంక ఈ ప్రాజెక్టులో భాగ‌మ‌వ్వ‌డంతో సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో భారీ హైప్ వ‌స్తోంది. తన షూటింగ్ డేట్స్ ఎక్కడా క్లాష్ అవ్వకుండా ఆమె టీమ్ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది.