'వారణాసి' తర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై
రాజమౌళి-మహేష్ బాబు వారణాసితో సౌత్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ప్రియాంక చోప్రా, తదుపరి మరాఠీ చిత్రం వెంటిలేటర్ 2ను నిర్మించనున్నారు. గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె ప్రాంతీయ సినిమాలపై ఆసక్తి చూపుతుండటంతో, ఇక బాలీవుడ్‌లో నటిస్తారా లేదా అనే చర్చ మొదలైంది.
By: Sivaji Kontham | 11 Nov 2026 7:16 AM ISTఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ `వారణాసి`తో ప్రియాంక చోప్రా జానాస్ చాలా ఏళ్ల తర్వాత సౌత్ కి వస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో తన పాత్ర గురించి చాలా చర్చ సాగుతోంది. అలాగే ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్ ప్రయాణం కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం హాలీవుడ్ సహా అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రియాంక కేవలం కథలో దమ్ముండి గ్లోబల్ అపీల్ ఉన్న చిత్రాలనే అంగీకరిస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియన్ స్టార్ల సరసన నటనకు ప్రాధాన్యమున్న పవర్‌ఫుల్ రోల్స్ వస్తే టాలీవుడ్ ఆఫర్లను వదులుకోవడానికి ఎంతమాత్రం సిద్ధంగా ఉండరని అభిమానులు ఊహిస్తున్నారు. అంతేకాకుండా గతంలో `జంజీర్` (తూఫాన్) చిత్రంలో రామ్ చరణ్‌తో నటించిన అనుభవం పీసీ సొంతం. భవిష్యత్తులో సరైన స్క్రిప్ట్ కుదిరితే చరణ్ సరసన మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కూడా సుముఖంగానే ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
ఇక నటనతో పాటు నిర్మాణ రంగాన్ని కూడా ఏకకాలంలో పర్యవేక్షిస్తున్న ప్రియాంక చోప్రా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ పర్పల్ పెబుల్ పిక్చర్స్ పతాకంపై జాతీయ అవార్డు పొందిన మరాఠీ హిట్ చిత్రం `వెంటిలేటర్`కు సీక్వెల్‌గా `వెంటిలేటర్ 2`ను అధికారికంగా ప్రకటించారు. రాజేష్ మాపుస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒకవైపు హాలీవుడ్‌లో నటిస్తూనే, భారతదేశంలో భిన్నమైన పరిశ్రమల వైపు పీసీ ప్రయాణం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం హిందీ పరిశ్రమకే పరిమితం కావాలనే ఆలోచన తనకు లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో నటిస్తూనే మరాఠా చిత్రానికి పని చేస్తోంది. `వారణాసి` సక్సెస్ తర్వాత పీసీ మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించేందుకు అవకాశం ఉంది.
హిందీ పరిశ్రమను పట్టించుకోని పీసీ:
ప్రస్తుత సన్నివేశం చూస్తుంటే టాలీవుడ్ సహా ప్రాంతీయ భాషల వైపు అడుగులు వేస్తున్న ప్రియాంక చోప్రా మరో బాలీవుడ్ సినిమాలో నటించే ఆలోచన చేయడం లేదా? అనే సందేహాలొస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఫర్హాన్ అక్తర్ తో భారీ మల్టీస్టారర్ చేయాలనుకున్నా రకరకాల కారణాలతో అది సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా పీసీ బాలీవుడ్ లో పెద్ద హీరోల సరసన నటించాలనే ఆలోచన చేయలేదు. దీంతో ఇక ఉత్తరాది పరిశ్రమలో ప్రియాంక చోప్రా నటించదా? అనే చర్చా వేడెక్కిస్తోంది.
