Begin typing your search above and press return to search.

ఈమె కదా అసలైన గ్లోబల్ స్టార్.. ప్రియాంక చేసిన పనికి ప్రశంసలు!

ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా తాజాగా చేసిన పనితో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు ఆమె గొప్పతనానికి, వ్యక్తిత్వానికి పలువురు ఫిదా అవుతున్నారు

By:  Madhu Reddy   |   3 Oct 2025 2:45 PM IST
ఈమె కదా అసలైన గ్లోబల్ స్టార్.. ప్రియాంక చేసిన పనికి ప్రశంసలు!
X

ఊరికే గ్లోబల్ స్టార్స్ అయిపోరు.. సినిమాలలో నటించడమే కాదు తమ వ్యక్తిత్వంతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకున్న వారికే ఇలాంటి అరుదైన గౌరవాలు లభిస్తాయని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా తాజాగా చేసిన పనితో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు ఆమె గొప్పతనానికి, వ్యక్తిత్వానికి పలువురు ఫిదా అవుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ఒకప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేసేవారు. కానీ కొన్ని కారణాలవల్ల హాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె.. అక్కడే సినిమాలు చేస్తూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణిగా చలామణి అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది ప్రియాంక చోప్రా.. అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ నిమిత్తం అప్పుడప్పుడు ఇండియాలో కూడా మెరుస్తున్న ఈమె.. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకుంది.

విషయంలోకి వెళ్తే..తాజాగా ముంబైలో జరిగిన బ్వ్ల గారి కార్యక్రమంలో ప్రియాంక చోప్రా సందడి చేసింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అక్కడికి 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రి కూడా హాజరయ్యింది. అయితే ఇక్కడ త్రిప్తి మొదట సోలోగా ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న ప్రియాంక ఆమెను ఆప్యాయంగా పలకరించి కౌగిలించుకుంది. అక్కడితో ఆగకుండా త్రిప్తితో కలిసి ఫోటోగ్రాఫర్ల కోసం కలిసి ఫోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇది చూసిన నెటిజన్స్ శత్రుత్వానికి పేరుగాంచిన సినీ పరిశ్రమలో కూడా మహిళలకు మద్దతు ఇచ్చే నిజమైన క్షణం ఇదే అంటూ అభివర్ణిస్తున్నారు. మరి కొంతమంది ప్రియాంక ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు త్రిప్తి పేరు కూడా మారుమ్రోగాలని ఆమె కెరియర్ మరింత ప్రకాశించాలని ప్రియాంక కోరుకుంటుంది. ఆ గుర్తింపు కోసమే ప్రియాంక తన వంతు ప్రయత్నం చేసింది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరికొంతమంది ఈమె కదా అసలైన గ్లోబల్ స్టార్ అంటే అంటూ కూడా ప్రియాంక చోప్రాపై ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ బ్యూటీ అయినప్పటికీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ బ్యూటీకి ఇలాంటీ సహకారం అందించడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ప్రియాంక చోప్రా అదే రోజు తమన్నా భాటియాతో కూడా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది . ఏది ఏమైనా ప్రియాంక చోప్రా ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లు అంటూ ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు ఇలా అందరితో కలగలిసిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అని చెప్పవచ్చు.