Begin typing your search above and press return to search.

ఫోటో టాక్: `వండ‌ర్ ఉమెన్` న‌య్ `థండర్ ఉమెన్`

ప్రియాంక చోప్రా (పీసీ) ఇటీవ‌ల రెండు ముఖ్య కార‌ణాల‌తో మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

By:  Sivaji Kontham   |   20 Feb 2026 9:19 AM IST
ఫోటో టాక్: `వండ‌ర్ ఉమెన్` న‌య్ `థండర్ ఉమెన్`
X

ప్రియాంక చోప్రా (పీసీ) ఇటీవ‌ల రెండు ముఖ్య కార‌ణాల‌తో మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఒక‌టి ఎస్ఎస్.రాజ‌మౌళి- మ‌హేష్‌తో వార‌ణాసి కోసం చేస్తున్న హార్డ్ వ‌ర్క్. రెండోది హాలీవుడ్ సినిమా `ది బ్ల‌ఫ్‌` లో త‌న పాత్ర కార‌ణంగా నిరంత‌రం హెడ్ లైన్స్ లో కొస్తోంది.





దీనికి మించి `ది బ్ల‌ఫ్` ప్ర‌మోష‌న్స్ లో పీసీ ఫోటోషూట్లు వెబ్ లో సునామీని సృష్టిస్తున్నాయి. ప్రియాంక చోప్రా ఈ హాలీవుడ్ సినిమాని స్వ‌యంగా నిర్మించ‌డంతో త‌న భ‌ర్త నిక్ జోనాస్ కూడా ప్ర‌మోష‌న్స్ లో భాగం అయ్యారు. పీసీ ప‌బ్లిక్ ఈవెంట్ల‌లో విభిన్న‌మైన లుక్స్ తో మ‌తులు చెడ‌గొడుతోంది. ఇంట‌ర్వ్యూల‌తో అద‌ర‌గొడుతోంది. మ‌ధ్య‌లో సంద‌ర్భం వ‌స్తే, త‌న‌ను ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. రాజ‌మౌళి వార‌ణాసి గురించి కూడా ప్ర‌మోష‌న్స్ చేస్తోంది.





ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో భాగంగా పీసీ తాజా లుక్ ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిగ్గా మారింది. లేటెస్ట్ లుక్స్ చూస్తుంటే వండర్ ఉమెన్ ని త‌ల‌పిస్తోంద‌ని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. ఒక‌రు `వండ‌ర్ ఉమెన్` కంటే `థండర్ ఉమెన్` అనే మాటే కరెక్ట్‌గా సెట్ అవుతుంద‌ని వ్యాఖ్యానించారు. ఆ కాన్ఫిడెన్స్, ఆ స్టైల్ నిజంగానే `థగ్` వైబ్స్ ఇస్తున్నాయ‌ని అభిమానులు అంటున్నారు. ఒక అభిమాని పీసీ ఫోటోతో క‌లిపి వండ‌ర్ ఉమెన్ గాల్ గాడోట్ ఫోటోని షేర్ చేయ‌గా నెటిజ‌నుల నుంచి స్పంద‌న‌లు అనూహ్యం.





ప్రస్తుతం పీసీ నటించిన‌ `ది బ్లఫ్‌` గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఉన్నాయి. ఈ సినిమా ఈనెల 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఇందులో కరీబియన్ దీవుల నేపథ్యంలో ఒక పవర్‌ఫుల్ సముద్రపు దొంగ పాత్రలో ప్రియాంక కనిపిస్తోంది. ఇన్నాళ్లూ గ్లామరస్ రోల్స్ లో చూసిన ఫ్యాన్స్‌కి, ఈ మొరటుగా, ధైర్యంగా ఉండే `పైరేట్` లుక్ ఒక కొత్త కిక్ ఇస్తోంది. అందుకే సోషల్ మీడియాలో `థగ్ ఉమెన్` అనే ట్యాగ్ వైరల్ అవుతోంది. ది బ్ల‌ఫ్ లో త‌న పాత్ర‌కు అనుగుణంగా పీసీ ఇలాంటి వేష‌ధార‌ణ‌ల‌తో సినిమాని ప్ర‌మోట్ చేస్తోంది.

రాజమౌళి సముద్రపు దొంగల కథ.. ఒక ఊహ:

నిజానికి బాహుబ‌లి, బాహుబ‌లి 2, ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత మ‌హేష్ - ప్రియాంక చోప్రాతో `వార‌ణాసి` అనే క్లాసిక్ ని తెర‌కెక్కిస్తున్న‌ ఎస్.ఎస్. రాజమౌళి ఒకవేళ పైరేట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ప్లాన్ చేస్తే అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అద్భుతం అవుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయ‌న `ది బ్ల‌ఫ్`లో పీసీ లుక్ ని, న‌ట‌న‌ను పొగిడేస్తున్నారు. ఒక్క ట్రైల‌ర్ లో పీసీ పెర్ఫామెన్స్ కే ఎంతో ఫిదా అయిపోయారు. అందుకే ఆయ‌న మ‌రో థగ్ లైఫ్ పై సినిమా తీయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. స‌ముద్రం నేప‌థ్యంలో జ‌క్క‌న్న ఒక‌ విజువల్ గ్రాండియర్ తెర‌కెక్కిస్తే, లైఫ్ ఆఫ్ పై లో సముద్రాన్ని ఎంత అందంగా, భయంకరంగా చూపించారో.. రాజమౌళి తన మేకింగ్‌తో అంతకంటే హై రేంజ్ విజువల్స్ ఇవ్వగలర‌ని ఊహిస్తున్నారు.

సముద్రపు దొంగల మధ్య ఉండే గొడవలు, బంధాలు, సాహసాలను జక్కన్న మార్క్ ఎమోషన్స్‌తో జోడిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయన‌డంలో సందేహం లేదు. ప్రస్తుతం రాజమౌళికి ఉన్న ఇంటర్నేషనల్ క్రేజ్‌కి ఇలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ అయితే హాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీ ఇవ్వొచ్చు. అయితే ప్రస్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు నేరుగా మహేష్ బాబుతో ఒక అడ్వెంచర్ సినిమానే చేస్తున్నారు. అది కూడా అడవుల నేపథ్యంలో సాగే సాహసయాత్రే! బహుశా భవిష్యత్తులో సముద్రం వైపు ఆయన కన్ను పడాలని కోరుకుందాం.