సముద్రపు దొంగ నిధి పెట్టెతో మనసు దోచిన గ్లోబల్ ఐకన్
ఆ డ్రెస్ వెనుక అర్థం ఉంది. ప్రియాంక ఈ ఎల్లో సారీ-గౌన్ ధరించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇది పైరేట్ థీమ్ కి సంబంధించిన లుక్.
By: Sivaji Kontham | 19 Feb 2026 3:25 PM ISTప్రియాంకా చోప్రా తన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ `ది బ్లఫ్` ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. ఈ ప్రచార కార్యక్రమంలో యాంజెల్ ని తలపించేలా ఎల్లో సారీ-గౌన్ లుక్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఈ లాంగ్ గౌనులో పీసీ ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది. చేతిలో ఉన్న ఆ చిన్న ట్రెజర్ చెస్ట్ (నిధి పెట్టె) బ్యాగ్ అంతకంటే ఎక్కువ చర్చనీయాంశమైంది.
దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు పరిశీలిస్తే ఈ బ్యాగ్ ఖరీదు అక్షరాలా ఆరు లక్షలు. ఈ బ్యాగ్ అమెరికన్ లగ్జరీ బ్రాండ్ జుడిత్ లీబర్ కు చెందింది. జుడీత్ విభిన్న ఆకృతుల్లో హ్యాండ్‌బ్యాగులు తయారు చేయడంలో ప్రసిద్ధి. దీని అసలు ధర 7,295 డాలర్లు. మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.6,63,623. ఇది చూడటానికి ఒక చిన్న నిధి పెట్టెలా ఉంటుంది. దీనిపై ఖరీదైన స్ఫటికాలు, రంగురంగుల రత్నాలు, ఇత్తడి ) హ్యాండిల్ ఉన్నాయి. దీనికి గుండె ఆకారంలో ఉండే ఒక చిన్న తాళం కూడా ఉండటం విశేషం.
ఆ డ్రెస్ వెనుక అర్థం ఉంది. ప్రియాంక ఈ ఎల్లో సారీ-గౌన్ ధరించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇది పైరేట్ థీమ్ కి సంబంధించిన లుక్. ది బ్లఫ్ సినిమాలో ప్రియాంక ఎర్సెల్ బోడెన్ (బ్లడీ మేరీ) అనే ఒక శక్తివంతమైన సముద్రపు దొంగ పాత్రలో నటించింది. అందుకే ఆ పాత్రకు గుర్తుగా ఒక ట్రెజర్ చెస్ట్ బ్యాగ్‌ని ఎంచుకుంది. తన పాత్ర సినిమా ఆరంభంలో తల మీద దుప్పటి వేసుకుని కనిపిస్తుంది. ఆ లుక్‌ను రీ-క్రియేట్ చేస్తూ, భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా పసుపు రంగు గౌన్‌ను సారీ లాగా డిజైన్ చేయించుకుంది. దీనిని గౌరవ్ గుప్తా డిజైన్ చేసారు. ది బ్లఫ్ ఫిబ్రవరి 25 న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
కథాంశం ఆసక్తికరం. 1800సం.లో నాటి కరేబియన్ దీవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రియాంక తన కుటుంబాన్ని కాపాడుకునే మాజీ పైరేట్ క్వీన్‌గా కనిపించబోతోంది. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్ చూసిన మన దర్శక ధీరుడు రాజమౌళి ప్రియాంక నటనను `ఫైరీ పెర్ఫార్మెన్స్` అని ప్రశంసించారు. పీసీ ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న `వారణాసి` సినిమాలో నటిస్తోంది. ఆమె హాలీవుడ్ యాక్షన్ లుక్ చూస్తుంటే రాజమౌళి సినిమాలో కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
