Begin typing your search above and press return to search.

23 ఏళ్ల క్రితమే టాలీవుడ్ ఎంట్రీ..కానీ!

అలా అవకాశాన్ని చేజార్చుకున్న ఆ హీరోయిన్ మళ్లీ తెలుగులో నటించలేదు. అలా 23 ఏళ్లు గడిచిపోయాయి.

By:  Madhu Reddy   |   14 Nov 2025 4:00 PM IST
23 ఏళ్ల క్రితమే టాలీవుడ్ ఎంట్రీ..కానీ!
X

చిత్ర పరిశ్రమలో సినీ సెలబ్రిటీల ఎంట్రీ అప్పుడప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సెలెబ్రిటీలు.. ఇతర భాష చిత్రాలలో అవకాశాలు వచ్చినప్పుడు అందులో నటించి.. సరిగ్గా విడుదల అవ్వాల్సిన సమయంలో ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత మళ్లీ అవకాశాలు వస్తాయా అంటే కష్టమే అని చెప్పాలి. అలా 23 ఏళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఒక హీరోయిన్ మాత్రం.. ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఆర్థిక కారణాల వల్లే ఆ సినిమా ఆగిపోయింది. దాంతో ఆ హీరోయిన్ కి తెలుగు తొలి అవకాశం లభించినట్టే లభించే చేజారిపోయిందని చెప్పాలి.

అలా అవకాశాన్ని చేజార్చుకున్న ఆ హీరోయిన్ మళ్లీ తెలుగులో నటించలేదు. అలా 23 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాలో నటించడమే కాకుండా ఈ సినిమా తన జీవితాన్నే మార్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆమె ఎవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత.. 2002లో తమిళ్ చిత్రం తమిళన్ ద్వారా కెరియర్ మొదలు పెట్టింది ప్రియాంక చోప్రా..

అయితే అదే ఏడాది తెలుగులో అపురూపం అనే సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది. మధుకర్, ప్రసన్న ఇందులో ప్రధాన పాత్రధారులు. జీ.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సగం షూటింగ్ పూర్తి చేసుకొని ఆర్థిక కారణాలవల్ల ఆగిపోయింది. దాంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ప్రియాంక చోప్రా అక్కడే సినిమాలు చేస్తూ సెటిలైపోయింది. కానీ మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొని ఆఖరికి అవకాశాలు కూడా చేజారడంతో హాలీవుడ్ కి వెళ్ళిపోయింది ఈ ముద్దుగుమ్మ. అక్కడే పలు సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ యాక్షన్ క్వీన్ గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు ఒక్కో చిత్రానికి రూ. 40 - 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ హాలీవుడ్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా.

అలాంటి ఈమె మళ్లీ 23 ఏళ్ల తర్వాత తొలిసారి తెలుగు చిత్రంలో ఎంపికయింది. అదే ఎస్ ఎస్ ఎం బి 29. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో చీర కట్టులో గన్ ఫైర్ తో యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది ప్రియాంక చోప్రా. ఇక ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండబోతోంది అని మాత్రం ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. 2027లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రేపు సాయంత్రం అనగా.. నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.