Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : మరో స్టన్నింగ్‌ లుక్‌లో గ్లోబల్‌ బ్యూటీ

తాజాగా ఈమె తన కొత్త స్టన్నింగ్‌ ఔట్‌ ఫిట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చూపు తిప్పనివ్వడం లేదు.

By:  Ramesh Palla   |   12 Sept 2025 11:00 PM IST
పిక్‌టాక్‌ : మరో స్టన్నింగ్‌ లుక్‌లో గ్లోబల్‌ బ్యూటీ
X

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ మూవీస్‌తో పాటు వెబ్‌ సిరీస్‌తో బిజీ బిజీగా ఉంది. గత పదేళ్ల కాలంలో ఆమె స్థాయి, క్రేజ్‌ అమాంతం పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రియాంక చోప్రాకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సెలబ్రిటీ దక్కించుకోలేని స్థాయిలో సోషల్‌ మీడియాలో, బయట కూడా ఫాలోయింగ్‌ దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలతో పాటు, తన భర్తతో ఉన్న ఫోటోలు, ఇతర ఫ్యామిలీ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 92.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ప్రియాంక చోప్రా ఏ చిన్న పోస్ట్‌ చేసిన లక్షల్లో లైక్స్‌, షేర్స్‌ వస్తూ ఉంటాయి. తాజాగా ఈమె తన కొత్త స్టన్నింగ్‌ ఔట్‌ ఫిట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా చూపు తిప్పనివ్వడం లేదు.


ప్రియాంక చోప్రా అందాల ఆరబోత ఫోటోలు

ఏ కూల్‌ సెప్టెంబర్‌ నైట్‌ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్‌ ఇచ్చి ప్రియాంక చోప్రా షేర్‌ చేసింది. లొకేషన్‌ ను న్యూయార్క్‌ ను ట్యాగ్‌ చేసింది. దాంతో ప్రస్తుతం ఈమె అమెరికాలో ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఎక్కువగా ఈమె అమెరికాలోనే ఉంటుంది. షూటింగ్స్ సమయంలో మాత్రమే ఈమె ఇండియాకు వస్తుంది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ స్టన్నింగ్‌ ఫోటోలను డీప్‌గా చూస్తే ఆమె అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతారు. ఇంతకు ముందుతో పోల్చితే పీసీ మరింత అందంగా, సన్నగా నాజూకుగా అయిందనే కామెంట్స్ వస్తున్నాయి. సాధారణంగానే ప్రియాంక ఫోటోలకు చాలా పాజిటివ్‌ కామెంట్స్ వస్తాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ప్రియాంక వయసు పెరిగినా కొద్ది మరింత అందంగా మారుతుంది అనే కామెంట్స్ నిజంగానే నిజం కావచ్చు అని చాలా మంది అంటున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా ఫోటో షూట్‌

భర్త నిక్‌తో కలిసి ప్రియాంక చోప్రా ఇచ్చిన ఫోజ్‌ సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రియాంక రెగ్యులర్‌గా పార్టీలకు హాజరు అవుతూ ఉంటుంది. అక్కడ తీసుకున్న ఫోటోలు ఇలా షేర్‌ చేయడం మనం చూడవచ్చు. ప్రతి పార్టీకి పీసీ ఇంతే అందంగా తయారు అవుతుంది. అయినా కూడా ఈసారి అంతకు మించి అందంగా పీసీ ఉంది అంటూ ప్రతి సారి అభిమానులు మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా వరుసగా ఇండియన్ మూవీస్‌లో చేస్తున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ సినిమాలు, సిరీస్‌ల్లోనూ నటించేందుకు కథలు వింటున్నట్లు తెలుస్తోంది. త్వరలో వంద మిలియన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ మైలు రాయిని చేరబోతున్న ప్రియాంక చోప్రా ఆ ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.


మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా

ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటిస్తున్న మహేష్‌ బాబు - రాజమౌళి సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు రాజమౌళి నుంచి కనీసం చిన్న ప్రకటన కూడా రాలేదు. సాధారణంగా రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అనే విషయాలను చెబుతూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో ఆయన నుంచి ప్రకటన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ సినిమాను 2027లో చూస్తామనే ఆశతో ఉన్నారు. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు కలిసి మొదటి సారి నటిస్తున్నారు. పీసీ కారణంగా బాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ కోసం ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను ఎంపిక చేసి ఉంటారు అనేది టాక్‌. ఆస్కార్‌ రేంజ్‌లో మరోసారి ఈ సినిమాను రాజమౌళి తీసుకు వెళ్తాడా అనేది చూడాలి.