'గ్లోబ్ ట్రాటర్' ప్రియాంక లుక్.. జక్కన్న ఏం చెప్పాలనుకుంటున్నాడు?
నిన్న మహేష్ బాబు థీమ్ సాంగ్‌తో సోషల్ మీడియాను ఊపేశారు. ఇప్పుడు, ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను వదిలారు.
By: M Prashanth | 12 Nov 2025 9:26 PM ISTరాజమౌళి మహేష్ బాబు (SSMB29) కాంబోలో వస్తున్న 'గ్లోబ్ ట్రాటర్' సినిమా ప్రమోషన్స్ విషయంలో జక్కన్న స్పీడ్ పెంచాడు. నవంబర్ 15న జరగబోయే భారీ ఈవెంట్ కోసం హైప్ మీటర్లను బద్దలు కొడుతున్నాడు. మొన్న విలన్ 'కుంభ' (పృధ్వీరాజ్) వీల్ చేయిర్ లోనే టెకీ లుక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. నిన్న మహేష్ బాబు థీమ్ సాంగ్‌తో సోషల్ మీడియాను ఊపేశారు. ఇప్పుడు, ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్‌ను వదిలారు.
ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్.. "జక్కన్న మార్క్ హీరోయిన్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కొత్త పోస్టర్‌ను సరిగ్గా గమనిస్తే, మనం ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇది రెగ్యులర్ గ్లామర్ డాల్ రోల్ కాదని ఈ ఒక్క లుక్‌తోనే రాజమౌళి ఫిక్స్ చేసేశాడు. ప్రియాంక చోప్రా ఒక వినూత్నమైన చీర కట్టులో చేతిలో గన్, ఫుల్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తోంది. ఇక ఆమె పాత్ర పేరు మందాకినీ అని రివిల్ చేశారు.
ఆమె ఏదో ఫైటింగ్ లో పోరాడుతున్నట్లు అడ్వెంచరర్ లుక్ లో హైలెట్ అవుతోంది. "చీరలో ఫైరింగ్" అంటే ఇదేనేమో. ఈ లుక్‌లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ బ్యాక్‌గ్రౌండ్. ప్రియాంక ఏదో దట్టమైన గుహల అంచున యాక్షన్ లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది 'గ్లోబల్ అడ్వెంచర్', 'ఆఫ్రికన్ ఫారెస్ట్' సినిమా అని పర్ఫెక్ట్‌గా సింక్ అవుతోంది. ఆ గుహల్లో ఏదో రహస్యం లేదా నిధి ఉన్నట్టు, అందులో ఈమె కూడా విలన్స్ తో పోరాడుతున్నట్లు ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.
మొన్న రిలీజైన విలన్ 'కుంభ' లుక్ ఏమో ఫుల్ హై టెక్నాలజీతో, రోబోటిక్ ఆర్మ్స్‌తో ఉంది. ఇప్పుడు ప్రియాంక లుక్ ఏమో.. ట్రెడిషనల్ చీర కట్టు, కానీ చేతిలో గన్.. ఈ రెండిటి కాంబినేషన్ అదిరిపోయింది. ఆ గుహల్లోని పురాతన రహస్యం ఉండవచ్చని అర్ధమవుతుంది. ఈ లుక్‌తో జక్కన్న ఒక్కటే క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవలం మహేష్ బాబు వన్ మ్యాన్ షో కాదు. ఈ అడ్వెంచర్‌లో హీరోయిన్‌కు కూడా యాక్షన్‌లో ఫుల్ స్కోప్ ఉంది.
ప్రియాంక పాత్ర కేవలం పాటలకే పరిమితం కాకుండా, కథలో కీలకంగా, మహేష్‌తో పాటు ఫైట్ చేసే రేంజ్‌లో ఉండబోతోందని ఈ ఒక్క పోస్టర్‌తో కన్ఫర్మ్ అయిపోయింది. విలన్‌ను చూపించాడు, హీరో థీమ్ వదిలాడు, ఇప్పుడు హీరోయిన్ యాక్షన్ లుక్ కూడా రివీల్ చేశాడు. ఇక నవంబర్ 15న జరగబోయే 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో ఈ ముగ్గురినీ కలిపి జక్కన్న ఇంకెలాంటి విజువల్ వండర్ చూపిస్తాడో అని ఫ్యాన్స్ వెయిటింగ్ పీక్స్‌కు చేరింది. చూడాలి మరి జక్కన్న ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడో.
