SSMB 29 కోసం ప్రియాంక భారీ కష్టం.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ప్రియాంక చోప్రా షేర్ చేసిన వీడియోతో పాటు ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
By: Madhu Reddy | 10 Nov 2025 7:39 PM ISTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎస్ ఎస్ ఎం బి 29 అనే సినిమాలో హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఒరిస్సాతో పాటు పలు ప్రాంతాలలో ఈమె పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఇకపోతే తన పాత్రకు సంబంధించి షూటింగ్ ఉన్నప్పుడు ఇండియాకి రావడం.. షూటింగ్ పూర్తి అవ్వగానే తిరిగి విదేశాలకు వెళ్లిపోవడం లాంటివి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ హైదరాబాద్లో లాంచ్ అయింది. ఇక విషయంలోకి వెళ్తే.. నవంబర్ 15వ తేదీన గ్లోబ్ ట్రోటర్ అంటూ లక్ష మంది సమక్షంలో హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ ఈవెంట్లో ఎస్ ఎస్ ఎన్ బి 29 మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.. ఇదిలా ఉండగా తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కి చేరుకున్న ప్రియాంక చోప్రా తాజాగా కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో నడుము అందాలను హైలెట్ చేస్తూ.. యాబ్స్ చూపిస్తూ.. ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె లుక్కు చూస్తుంటే సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మేరకు తాజాగా ఒక వీడియోని కూడా ఆమె రిలీజ్ చేస్తూ.." నేను ఎందుకు ఎప్పుడూ హైదరాబాదులోనే ఉంటున్నాను అనే విషయం మీకు నవంబర్ 15న తెలుస్తుంది" అంటూ చెప్పిన ఈమె ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది అని కూడా స్పష్టం చేసింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా షేర్ చేసిన వీడియోతో పాటు ఆమె షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఆమె క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ కానున్నాయని.. ఆ సన్నివేశాలు కొన్నింటిని ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ లో చూపించనున్నారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు గ్లోబ్ ట్రోటర్ పై అంచనాలు పెంచుతూ సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ చేస్తోంది ప్రియాంక చోప్రా.
మరోవైపు ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు ఇందులో ఆయన కుంభ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు నవంబర్ 11న అనగా రేపు ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడ లేదు. ప్రస్తుతం ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఈ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. అటు హాలీవుడ్లో పలు సినిమాలు , వెబ్ సిరీస్ లు చేసి మరింత క్రేజ్ దక్కించుకుంది.. అంతేకాదు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సెలబ్రిటీ జాబితాలో ప్రియాంక చోటు దక్కించుకుంది.
