భారత్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హబ్బీనా!
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ పెళ్లి భారత్‌లోనే జరగడానికి గల కారణాన్ని పీసీ తాజాగా వెల్లడించారు. తొలుత ప్రైవేట్ ఐలాండ్‌లో పెళ్లి చేసుకోవాలని ప్రియాంక భావించారట. అయితే తన సంస్కృతి, సంప్రదాయాల మధ్య భారత్‌లోనే వివాహం చేసుకోవాలని నిక్ పట్టుబట్టినట్లు తెలిపారు. దీంతో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది.
By: Srikanth Kontham | 13 Nov 2026 12:00 AM ISTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- పాప్ సింగర్ నిక్ జోనాస్‌ల వివాహం రాజాస్టాన్ లోని జోధ్‌పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఎంత వైభవంగా జరిగిందో తెలిసిందే. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితు, స్నేహితులు, సెలబ్రిటీల సమక్షంలో పీసీ-నిక్ ఒకటయ్యారు. మరి విదేశీయుడైన నిక్ జోనాస్ వివాహం తన సొంత దేశమైనా అమెరికాలో ఎందుకు పెట్టుకోలేదు? భారత్ లోనే ఎందుకు వివాహం జరిగిందంటే? వేదిక విషయంలో తెరవెనుక జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రియాంక చోప్రా తాజాగా బయట పెట్టారు. వివరాల్లోకి వెళ్తే..
వాస్తవానికి ప్రియాంక ఓ ప్రైవేట్ ఐలాండ్‌లో సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసారుట. కానీ నిక్ జోనాస్ మాత్రం అందుకు భిన్నంగా భారత్‌లోనే వివాహం చేసుకోవాలని పట్టుబట్టారట. ఇద్దరు వివాహ వేదిక గురించి చర్చిం చుకుంటున్న సమయంలో ప్రపంచానికి దూరంగా ప్రైవేట్ ఐలాండ్‌లో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రియాంక సూచించారట. ఆ ఐడియా విన్న వెంటనే నిక్ జోనాస్ ఆశ్యర్యపోయారుట. మనం ఇండియాలో ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నీ సంస్కృతి, సంప్రదాయాల మధ్య నీ సొంత దేశంలోనే వివాహం జరగాలని నిక్ అన్నట్లు ప్రియాంక వెల్లడించారు.
నిక్ తీసుకున్న నిర్ణయం తనకెంతో ఆనందాన్ని.. గర్వాన్ని ఇచ్చిందని ప్రియాంక ఎమోషనల్ అయ్యారు. ఒక విదేశీయుడై ఉండి కూడా భారతీయ సంప్రదాయాలకు.. తన కుటుంబానికి నిక్ ఇచ్చిన గౌరవం చూసి తాను ఎంతో ముగ్ధురాలయ్యానని పీసీ పేర్కొన్నారు. అటుపై ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉమైద్ భవన్ ప్యాలెస్‌ను వేదికగా ఎంచుకుని హిందు - క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం మూడు రోజుల పాటు అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుక పెళ్లిలా కాకుండా రెండు భిన్న సంస్కృతుల కలయికగా నిలిచిందని పీసీ గుర్తు చేసుకున్నారు.
ముఖ్యంగా నిక్ జోనాస్ భారతీయ పెళ్లి వేడుకల్లోని ప్రతి ఆచారాన్ని ఎంతో ఆసక్తిగా.. భక్తిశ్రద్ధలతో పాటించడం పీసీ కుటుంబ సభ్యులందరినీ ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఒకవేళ పీసీ అనుకున్నట్లు ఐలాండ్‌లో పెళ్లి చేసుకుంటే? ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు.. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు కోల్పేయే వాళ్లమని అభి ప్రాయపడ్డారు. అలా జోడీ భారత్ లో వివాహం చేసుకున్నారు. ఇక పీసీ సినిమాల విషయానికి వస్తే `వారణాసి` సినిమాతో అమ్మడు టాలీవుడ్ లో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సాధిస్తే గ్లోబల్ స్థాయిలో పీసీ రేంజ్ రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. పీసీ ఇప్పటికే హాలీవుడ్ కి సుపరిచితమైన నటి కావడంతో ఈ విజయం అమ్మడికి మరింత కలిసొస్తుంది.
