పీసీ నోట చాలా కాలానాకి అరుదైన ప్రశంసలు!
తాజాగా బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Srikanth Kontham | 11 Jun 2026 8:00 PM ISTగ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ `మా బెహన్` చిత్రంపై అందులో నటించిన నటీనటులపై అభిమానాన్ని చాటుకున్నారు. చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహించే ప్రియాంక కంటెంట్ కు ముగ్ధురాలయ్యారు. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి మాధురీ దీక్షిత్, నేటి తరం క్రేజీ బ్యూటీ తృప్తి దిమ్రిల నటన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. ఈ చిత్రంలో బాలీవుడ్ ఎవ్వర్ డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ -నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి తొలిసారిగా కలిసి నటించారు.
ఇద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్త మ్యాజిక్‌ను క్రియేట్ చేసిందని ప్రియాంకా చోప్రా అభిప్రాయపడ్డారు. మాతృస్వామ్య బంధాలు, మహిళల మధ్య ఉండే ఆత్మీయత, సమాజంలో వారి పోరాటాల నేపథ్యంలో సాగే వినూత్న కథాంశం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉందని, నటీమణుల ఎంపిక సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందన్నారు. ఇదే పోస్ట్ లో డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ధరణా దుర్గా గురించి పీసీ ప్రత్యేకంగా ప్రస్తావించడం అందరి దృష్టిని ఆకర్షించింది. తాను వ్యక్తిగతంగా ధరణా దుర్గాకు చాలా పెద్ద ఫ్యాన్ అని ప్రియాంక బహిరంగంగా ప్రకటించడం విశేషం.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నుండి వెండితెరకు పరిచయమైన ప్రతిభను ఇలాంటి గ్లోబల్ ఐకాన్ గుర్తించడం చర్చనీయాంశంగా మారింది. ధరణా దుర్గా ఇన్‌స్టాగ్రామ్ , యూట్యూబ్‌లో తనదైన శైలి కామెడీ రీల్స్, విభిన్నమైన క్యారెక్టరైజేషన్లతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియాంకా చోప్రా వంటి అంతర్జాతీయ నటి నుండి ప్రశంసలు అందుకోవడంతో ధరణా దుర్గా భావోద్వేగానికి లోనైంది.
తన సోషల్ మీడియా వేదికగా ప్రియాంకకు ధన్యవాదాలు తెలిపింది. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొంది. మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు .. భిన్న తరాల నటీమణులు కలిసి చేసే ప్రయోగాలకు బాలీవుడ్‌లో ఇటీవల ఆదరణ పెరుగుతోంది. `మా బెహన్` చిత్రం కూడా అదే బాటలో సరికొత్త రికార్డులనే సృష్టిస్తుంది. తాజాగా ప్రియాంకా చోప్రా అందించిన లౌడ్ సపోర్ట్ .. ప్రశంసలు సినిమాకు మరింత హైప్‌ను తీసుకువచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పీసీ ఇలా ఓ హిందీ సినిమా గురించి మాట్లాడి చాలా కాలవుతుంది.
అమ్మడు హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత హిందీ సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వీక్షించినా వాటి గురించి పెద్దగా స్పందించింది లేదు. ప్రత్యేకించి యువ నటిని పీసీ ప్రశంసించడం అన్నది గొప్ప విషయం. తొలి సినిమాతో ధరణా దుర్గ పీసీ దృష్టిలో పడటం అన్నది అదృష్టంగానే చెప్పాలి. పరిశ్రమకు చెందిన సీనియర్ నటీనటులు కొత్త తరం ప్రతిభావంతులు కలిసి పని చేస్తున్నప్పుడు ఇలాంటి అంతర్జాతీయ స్టార్ల మద్దతు లభించడం సినిమా రేంజ్‌ను మారుస్తుంది.
