పారిస్ బ్యాక్‌డ్రాప్‌లో స్టన్నింగ్ లుక్… డియోర్ డ్రెస్సులో ప్రియాంక చోప్రా
గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా జోనాస్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Madhu Reddy | 7 July 2026 1:12 PM ISTగ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా జోనాస్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. పారిస్ నగర అందాల బ్యాక్‌డ్రాప్‌లో ఆమె దిగిన కొన్ని స్టన్నింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. హై ఫ్యాషన్, సమ్మర్ ఎలిగాన్స్ కలబోసినట్లున్న ఈ డియోర్ అవుట్‌ఫిట్ లుక్‌లో ప్రియాంక గ్లోబల్ రేంజ్ మెరుపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఆ అదిరిపోయే లగ్జరీ లుక్ విశేషాలు గురించి చూద్దాం..
పారిస్ బాల్కనీలో కలర్‌ఫుల్ మెరుపులు:
ఈ ఫొటోషూట్‌లో ప్రియాంకా చోప్రా స్టైలింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. పారిస్‌లోని సాంప్రదాయ క్లాసిక్ బాల్కనీపై నిలబడి, అక్కడి అందమైన బిల్డింగుల బ్యాక్‌డ్రాప్‌లో ఆమె పోజులిచ్చింది. ఒక వైబ్రంట్ ఆరెంజ్ కలర్ పెటల్ ఎంబెల్లిష్డ్ మినీ డ్రెస్‌లో ప్రియాంక ఎంతో అందంగా మెరిసిపోతోంది. ఇక ఒక భుజంపైకి వేసుకున్న పొడవాటి అలల జుట్టు, ముఖంలో కాన్ఫిడెంట్ గ్లో, ఆకర్షణీయమైన పోయిజ్‌తో ఆమె హై ఫ్యాషన్ లుక్‌ను పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసింది.
డియోర్ క్రియేషన్‌కు అదిరిపోయే ట్రిబ్యూట్:
ఈ అద్భుతమైన డియోర్ క్రియేషన్‌ను డిజైన్ చేసిన జొనాథన్ ఆండర్సన్‌కు ప్రియాంక తన స్టైలిష్ ట్రిబ్యూట్ అందించింది. ఈ డ్రెస్‌కు ఉన్న ఫ్లోరల్ టెక్స్చర్స్, దానికి మ్యాచ్ చేస్తూ చేతిలో పట్టుకున్న మెరూన్ కలర్ హ్యాండ్‌బ్యాగ్, అలాగే సింపుల్ గోల్డ్ జ్యువెలరీ ఆమె లుక్‌కు మరింత రాయల్ టచ్ ఇచ్చాయి. ఇక 'ఇది చాలా అద్భుతం' అంటూ ఈ సరికొత్త కలెక్షన్‌ను ఆమె అభినందించిన తీరు ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేస్తోంది.
మిస్ వరల్డ్ నుండి హాలీవుడ్ స్టార్ వరకు:
2000 సంవత్సరంలో మిస్ వరల్డ్‌గా నిలిచిన ప్రియాంకా చోప్రా, ఆ తర్వాత ‘తమిళన్’ (2002) అనే తమిళ సినిమాతో నటిగా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. బాలీవుడ్‌లో ‘ఫ్యాషన్’ సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకోవడమే కాకుండా బర్ఫీ, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలతో టాప్ స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత హాలీవుడ్‌లో ‘క్వాంటికో’, ‘బేవాచ్’ వంటి ప్రాజెక్టులతో గ్లోబల్ లెవెల్‌లో తన జెండా పాతేసింది.
చేతినిండా క్రేజీ గ్లోబల్ ప్రాజెక్టులు:
ప్రస్తుతం ప్రియాంక చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కార్ల్ అర్బన్‌తో కలిసి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయిన ‘ది బ్లఫ్’ తో పాటు గత ఏడాది ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, బాలీవుడ్ చిత్రం ‘జీ లే జరా’ మూవీ లో నటించి మెప్పించారు.ఇక ఇప్పుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ లో కూడా నటిస్తున్నారు.
ఎప్పటికీ తగ్గని గ్లోబల్ క్రేజ్:
నటిగా, ప్రొడ్యూసర్‌గా, గ్లోబల్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రియాంకా చోప్రా జోనాస్ ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. ఇక పారిస్ వీధుల్లో ఆమె చేసిన ఈ లేటెస్ట్ సందడి, ఆమె గ్లోబల్ అప్పీల్ ఎప్పటికీ తగ్గదని మరోసారి నిరూపించింది. అటు ఇంటర్నేషనల్ సినిమాలు, ఇటు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో ఎప్పుడూ టాప్‌లో ఉండే ప్రియాంక.. రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..
