రాజమౌళి ఫామ్ హౌస్ లో ప్రియాంక చోప్రా కూతురు సందడి..!
ప్రియాంక చోప్రా ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉంది. గత కొన్నాళ్లుగా హాలీవుడ్‌కే పరిమితం అయిన ప్రియాంక చోప్రా కేవలం రాజమౌళి అడిగిన కారణంగా ఈ సినిమాలో నటించేందుకు రెడీ అయింది.
By: Ramesh Palla | 13 Nov 2025 4:15 PM ISTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 15న సినిమాకు సంబంధించిన కీలక ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకి జరగని స్థాయిలో ఈవెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేష్ బాబు స్టార్‌డంకు ఏమాత్రం తగ్గకుండా, రాజమౌళి భారీ మేకింగ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందుతోంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో సైతం ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ఇప్పటి నుంచే మొదలు అయింది అనడంలో సందేహం లేదు.
మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా..
ప్రియాంక చోప్రా ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉంది. గత కొన్నాళ్లుగా హాలీవుడ్‌కే పరిమితం అయిన ప్రియాంక చోప్రా కేవలం రాజమౌళి అడిగిన కారణంగా ఈ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. ఇటీవల సోషల్ మీడియాలో ఈమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆ సమయంలో ఒక నెటిజన్ మీరు షూటింగ్‌లో ఉన్నప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉంటారా, ముఖ్యంగా మహేష్ బాబు, రాజమౌళి మూవీ షూటింగ్ సమయంలో మీ ఫ్యామిలీ సమయం ఎలా ఉంది, మీరు పూర్తిగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారా అని ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నకు ప్రియాంక చోప్రా సమాధానం ఇచ్చింది. తాను షూటింగ్‌తో బిజీగా ఉన్న సమయంలో తన కూతురు సైతం హైదరాబాద్‌లోనే ఉందని, తన కూతురు ప్రస్తుతం హైదరాబాద్‌లో మంచి క్వాలిటీ టైం ను స్పెండ్ చేస్తుంది అంటూ ఆమె ఎక్స్ ద్వారా చెప్పుకొచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో గ్లోబ్ ట్రాటర్...
ఎక్స్‌లో తన కూతురు మాల్తీ గురించి చెబుతూ... నేను గ్లోబ్ ట్రాటర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో నా కూతురు మాల్తీ ఎక్కువగా మహేష్ బాబు కూతురు సితారతో సమయం గడుపుతోంది. ఇద్దరు చాలా ఎక్కువ సమయం కలిసి ఆడుకోవడం జరుగుతుందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా రాజమౌళి గారి ఫామ్ హౌస్‌కి వెళ్లడం, అక్కడ ఆవులతో, చిన్న ఆవు పిల్లలతో ఆడుకోవడంను ఆస్వాదిస్తుందని చెప్పుకొచ్చింది. మంచి మెమోరిస్‌ను తను క్రియేట్ చేసుకుంటుంది. హైదరాబాద్ వచ్చిన సమయంలో మాల్తీ చాలా ఎంజాయ్ చేస్తుందని, తాను షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తుంది అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ఇప్పటికే ప్రియాంక చోప్రా ఈవెంట్ కోసం హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల ఆమె పోస్టర్ ను జక్కన్న రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.
కీరవాణి సంగీతం అందిస్తున్న జక్కన్న సినిమా...
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చాలా కాలం తర్వాత ఒక ప్రస్తుత టైమ్ జోనర్ మూవీని రూపొందిస్తున్నట్లుగా ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ ను చూస్తే అర్థం అవుతుంది. తప్పకుండా ఈ సినిమా కూడా మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది ఎంతవరకు సాధ్యం అనేది మాత్రం క్లారిటీ లేదు. తప్పకుండా సినిమా ఆలస్యం అవుతుంది అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న సినిమా ఎంత ఆలస్యం అయితే అంతగా వెయిట్ పెరుగుతుంది, అలాగే సినిమా క్వాలిటీ కూడా పెరుగుతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల, ప్రేక్షకులు భావిస్తున్నారు.
