Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ మ‌ధ్య వార‌ధి మ‌రిదేనా?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా - అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ జోడీ సినీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ఒకటి.

By:  Srikanth Kontham   |   16 July 2026 1:51 PM IST
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ మ‌ధ్య వార‌ధి మ‌రిదేనా?
X

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా - అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ జోడీ సినీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ఒకటి. ఇద్ద‌రి ప్రేమ ప్రయాణం ఎలా? మొదలైందో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా పదేళ్ల క్రితం నాటి వారి పరిచయం.. ఆ తొలి సందేశానికి సంబం ధించిన ఆసక్తికర విషయాలను నిక్ జోనాస్ స్వయంగా పంచుకున్నారు. ఇద్ద‌రి ప్రేమకథ వెనుక ఉన్న అసలైన క్యూపిడ్ ఎవరో తెలిస్తే ? అంతా ఆశ్చర్యపోక తప్పదు. అది మరెవరో కాదు. నిక్ సోదరుడు కెవిన్ జోనాస్. ఇద్దరి మధ్య బంధాన్ని ఏర్పరచడంలో కెవిన్ వారధిగా నిలిచారు.

ఓ వ్యక్తిగత సంభాషణలో భాగంగా సోషల్ మీడియా ద్వారా నిక్ పంపిన ఆ తొలి సందేశం ఇద్ద‌రి మధ్య ఉన్నతమైన బంధానికి దారితీస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. నిక్ జోనాస్ పంపిన ఆ మొదటి మెసేజ్ ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే? ఒక పరిచయంతో మొదలై ఆ తర్వాత పెళ్లి పీటల వరకు దారితీసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సెలబ్రిటీల మధ్య దూరాన్ని ఎలా తగ్గిస్తాయో? చెప్పడానికి వీరిద్దరి ఉదాహరణే . ఒక చిన్న సందేశం రెండు వేర్వేరు సంస్కృతుల వ్యక్తులను ఎలా ఏకం చేస్తుందో? వీరి ప్రయాణం తెలియజేస్తుంది.

ప్రియాంక - నిక్ జోనాస్ ప్రేమకథ ఒక సెలబ్రిటీల కథలా కాకుండా? రెండు మనసుల కలయికగా అభిమానుల మనసుల్లో నిలిచిపోయింది. కెవిన్ జోనాస్ మధ్యవర్తిత్వం వహించి ఇద్ద‌రిని కలపడం వెనుక ఉన్న ఉద్దేశం, వారికి ఒకరిపై ఒకరికి ఉన్న పరస్పర గౌరవాన్ని పెంచింది. ఈ విషయాన్ని బహిరంగపరచడం ద్వారా నిక్ తన సోదరుడి పట్ల ఉన్న కృతజ్ఞతను కూడా చాటుకున్నారు. ప్ర‌స్తుతం ఈ దంపతులు వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. పబ్లిక్ ఈవెంట్లలో కూడా ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు.

వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ .. పరస్పర అవగాహన చూస్తుంటే? పదేళ్ల క్రితం నాటి ఆ చిన్న మెసేజ్ వారి జీవితాన్ని ఎంతలా మార్చేసిందో? అర్థమవుతుంది. ఇద్దరి కెరీర్లు వేర్వేరు రంగాల్లో ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను పంచుకుంటూ అంద‌రికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి ప్రేమకథ సోషల్ మీడియా వేదికల ద్వారా ఏర్పడే సంబంధాల గురించి కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఒక సరైన నిర్ణయం ..యు సరైన సమయంలో పంపిన ఒక చిన్న సందేశం జీవితాంతం తోడుగా ఉండే బంధాన్ని ఎలా సృష్టిస్తుందో? ప్రియాంక - నిక్ జంట నిరూపించింది. వీరు ఎంచుకున్న మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.