మాల్తీ 100రోజుల పోరాటం..షాకిచ్చే సంగతి చెప్పిన ప్రియానిక్
ప్రస్తుతం మాల్తీ మేరీ ఎంతో ఆరోగ్యంగా ఉంది. అన్ని ఆటంకాలను దాటుకుని మాల్తీ పూర్తి ఆరోగ్యంతో ఎదిగేస్తోంది.
By: Srikanth Kontham | 6 Feb 2026 8:00 AM ISTనిర్ధేశించిన గడువుకు ముందే, అంటే నెలలు తక్కువగా పుట్టే బిడ్డల విషయంలో కొన్నిసార్లు చాలా కాంప్లికేషన్లు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాలు బాధల్ని అనుభవించింది మాల్తీ మేరీ. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ (ప్రియానిక్) దంపతుల గారాల కుమార్తె మాల్తీ మేరీ 100 రోజుల ముందస్తు జనన సంక్లిష్ఠతల గురించి, బాధల గురించి వింటే హృదయం చలించిపోకుండా ఉండదు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 6 సార్లు రక్త మార్పిడి చేయడం అంటే ఆ పసిగుడ్డు ఎంతటి బాధను అనుభవించిందో వారి మాటల్లో వింటే హృదయం కలచివేయకుండా ఉండదు.
మాల్తీ మేరీ ప్రీమ్యాచూర్ బర్త్ గురించి ప్రియాంక చోప్రా గతంలో పలు ఇంటర్వ్యూలో చాలా షాకింగ్ విషయాలు చెప్పారు. ఇప్పుడు నిక్ జోనాస్ మరోసారి వాటిని తిరిగి రిమైండ్ చేసారు. తన కుమార్తె కష్టాల గురించి అతడు వివరించిన తీరుకు అందరూ చలించిపోతున్నారు. మాల్తీ జననం అంత సులువుగా జరగలేదని అందరికీ అర్థమవుతోంది.
తన కుమార్తె కష్టం గురించి చెబుతూ, ఒక తండ్రిగా ఆ క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆయన చాలా ఉద్వేగానికి లోనయ్యారు. నెలలు నిండకుండానే బిడ్డ జననం ఎన్ని కాంప్లికేషన్లు తెస్తుందో అతడి మాటలు చెబుతున్నాయి. మాల్తీ మేరీ గడువు కంటే దాదాపు 12 వారాల ముందే జన్మించింది. దీనివల్ల ఆమె ఆరోగ్యం చాలా బలహీనంగా ఉంది. పుట్టిన తర్వాత మాల్తీ దాదాపు 100 రోజులకు పైగా హాస్పిటల్‌లోని నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్.ఐ.సి.యు)లోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత చిన్నారి ప్రాణం నిలబెట్టేందుకు ఆరుసార్లు రక్తమార్పిడి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పసిబిడ్డ అంతటి బాధను అనుభవించడం తల్లిదండ్రులుగా నిక్, యు ప్రియాంకలకు అత్యంత బాధాకరమైన, కఠినమైన సమయమనేది అర్థమవుతోంది.
ఈ కష్టకాలంలో తన భార్య తాను ఎంతో ధైర్యంగా నిలబడ్డామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వద్దకు వెళ్లి బిడ్డను చూస్తూ, ఎప్పుడు తమ ఇంటికి తీసుకెళతామో అర్థం కాని స్థితిలో ప్రతిరోజూ గడపడం ఎంత కష్టంగా గడిచిందో కూడా నిక్ వివరించారు. జీవితంలో ఇది ఎన్నడూ మర్చిపోలేని ఘట్టమన అన్నారు.
ప్రస్తుతం మాల్తీ మేరీ ఎంతో ఆరోగ్యంగా ఉంది. అన్ని ఆటంకాలను దాటుకుని మాల్తీ పూర్తి ఆరోగ్యంతో ఎదిగేస్తోంది. నిక్, ప్రియాంక తరచుగా తమ కుమార్తెకు సంబంధించిన క్యూట్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ఆ చిన్నారి ఎదుగుదల చూస్తుంటే, ఆనాడు వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు అనిపిస్తుంది. నిజంగా ప్రియానిక్ జంట క్లిష్ఠ సమయంలో చూపిన సహనం, ధైర్యం ఎంతోమంది తల్లిదండ్రులకు స్ఫూర్తినిస్తాయి.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. మహేష్ - రాజమౌళితో వారణాసి చిత్రం వేగంగా తెరకెక్కుతోంది. 2027లో ఈ చిత్రం విడుదలవుతుంది. హృతిక్ రోషన్ తో క్రిష్ 4, ఫర్హాన్ తో `జీలే జరా`, `డాన్ 3` వంటి చిత్రాలు చేయాల్సి ఉంది. నిక్ జోనాస్ తన అంతర్జాతీయ కాన్సెర్టులతోను బిజీ బిజీగా ఉన్నాడు.
